మరో మూడు రోజుల్లో అక్షయ తృతీయ పర్వదినం రానుంది. చాలా మంది బంగారం కొనుగోలు చేస్తారు. ఈ సారి అక్షయతృతీయకు ముందు సూర్య గ్రహణం ఏర్పడుతుంది. దాంతో కొన్ని రాశుల వారికి శుభయోగాలు ఉన్నాయి అంటున్నారు జ్యోతిష్యశాస్త్ర నిపుణులు. ఆ వివరాలు..
హిందూ మతంలో ప్రతి నెలలో ఏదో ఒక పండగ ఉంటుంది. మరో మూడు రోజుల్లో అక్షత తృతీయ రానుంది. తెలుగు క్యాలెండర్ ప్రకారం ప్రతి సంవత్సరం వైశాఖ మాసం శుక్ల పక్షంలోని తదియ తిథి నాడు అక్షయ తృతీయ పండుగను జరుపుకుంటారు. ఇక ఈ ఏడాది ఏప్రిల్ 22న అనగా శనివారం నాడు అక్షయ తృతీయ వచ్చింది. ఈ పండుగ పూట లక్ష్మీ దేవి స్వరూపమైన బంగారం, వెండి లేక వేరే కొనుగోళ్లు చేస్తే.. ఆ ఏడాది అంతా కలసి వస్తుందని భావిస్తారు. అందుకే అక్షయ తృతియ నాడు ఎంతో కొంత బంగారం కొనాలని భావిస్తారు. బంగారం కొన్నా కొనకపోయినా సరే.. అక్షయ తృతీయ నాడు.. విష్ణుమూర్తిని, లక్ష్మీదేవిని పూజించడం వల్ల ఇంట్లో సంతోషం, శ్రేయస్సు వెల్లివిరుస్తాయని పండితులు చెబుతున్నారు.
ఇదిలా ఉంటే.. ఇక ఈ ఏడాది సూర్య గ్రహణం తర్వాత అక్షయ తృతీయ పర్వదినం రాబోతుంది. దాంతో అక్షయ తృతీయ రోజే మేషరాశిలో ప్రధాన గ్రహాల కలయిక జరగనుంది. ఈ సమయంలో మేషరాశిలో సూర్యుడు, రాహువు, బుధుడి కలయిక జరనుంది. మరోవైపు ఇదే సమయంలో గురువు కూడా ఈ రాశిలో చేరనున్నాడు. ఈ గ్రహాల అరుదైన కలయిక వల్ల ఏకంగా ఆరు శుభ యోగాలు ఏర్పడనున్నాయి. అవి వరుసగా త్రిపుష్కర, ఆయుష్మాన్, రవి, సర్వార్ధ సిద్ధి, అమృత సిద్ధి, శుభ యోగాలు ఏర్పడనున్నాయి. కనుక ఈ ఏడాది అక్షయ తృతీయ నుంచి ద్వాదశ రాశులలో ఐదు రాశుల వారికి శుభప్రదమైన ఫలితాలు రానున్నాయని.. వారికి ఇక తిరుగే ఉండదని జ్యోతిష్యశాస్త్రనిపుణులు చెబుతున్నారు. మరి ఆ ఐదు రాశులు ఏవి అంటే..
అక్షయ తృతీయ వేళ ఆరు శుభయోగాలు లభించే ఐదు రాశుల్లో మేష రాశి కూడా ఉంది. ఈ గ్రహాల అరుదైన కలయిక మేషరాశిలోనే ఏర్పడుతుండటంతో.. ఈ రాశి వారికి అనేక శుభ యోగాలు కలుగుతాయి అంటున్నారు జ్యోతిష్యశాస్త్ర పండితులు. అక్షయ తృతీయ నుంచి ఈ రాశి వారికి అన్ని రంగాల్లో అద్భుతమైన ప్రయోజనాలు దక్కుతాయని.. సమాజంలో వీరికి గౌరవం, ప్రతిష్ట పెరుగుతాయని చెబుతున్నారు. రానున్న కాలంలో వీరు మతపరమైన పనుల్లో పాల్గొనడమే కాక దానధర్మాలు చేస్తారని.. శుభకార్యాల్లోనూ పాల్గొంటారని.. ఇక ఆర్థికంగా కూడా ఈ రాశి వారికి మంచి ప్రయోజనాలు దక్కుతాయని జ్యోతిష్యశాస్త్ర పండితులు చెబుతున్నారు.
వృషభ రాశి వారికి శుక్రుడు అధిపతిగా ఉంటాడు. అక్షయ తృతీయ వేళ వృషభ రాశిలో శుక్రుడు ఉండటం వల్ల.. రాజయోగం ఏర్పడనుంది. ఫలితంగా వృషభ రాశి వారికి అనేక శుభ ఫలితాలు దక్కనున్నాయి. మరోవైపు అక్షయ తృతీయ వేళ ఈ రాశి వారు కొత్త దుస్తులు, విలువైన ఆభరణాలను పొందుతారు. కళా రంగానికి చెందిన వారికి తమ ప్రతిభకు గుర్తింపు దక్కడమే కాదు.. ప్రశంసలు.. ప్రయోజనాలు కూడా దక్కుతాయి అంటున్నారు జ్యోతిష్యశాస్త్ర నిపుణులు. వీరి కుటుంబ జీవితంలో ఆప్యాయత పెరుగుతుంది. మీరు కొన్ని బహుమతులను కూడా పొందే అవకాశం ఉంది అంటున్నారు.
కర్కాటక రాశి వారికి అక్షయ తృతీయ రోజున ఆర్థిక పరంగా అద్భుతమైన ప్రయోజనాలు కలగనున్నాయి అంటున్నారు జ్యోతిష్య శాస్త్ర నిపుణులు. ఈ సమయంలో ఏర్పడే ఆరు శుభ యోగాల వల్ల కర్కాటక రాశి వారు శుభ ఫలితాలు పొందబోతున్నారు అని తెలిపారు. ఈ రాశి వారు తాము పని చేస్తోన్న రంగంలో ముందుకు వెళ్తారని.. విజయం సాధించడమే కాక… ఆర్థిక పరంగా కూడా అనేక ప్రయోజనాలు పొందుతారని తెలుపుతున్నారు. ఈ పవిత్రమైన రోజున వెండి, వజ్రాలు వంటి వాటితో మీరు శుభ ఫలితాలు పొందుతారు అంటున్నారు జ్యోతిష్యశాస్త్ర నిపుణులు.
సింహ రాశి వారికి సూర్యుడు అధిపతిగా ఉంటాడు. ఈ రాశి నుంచి సూర్యుడు ఉచ్ఛమైన స్థితిలో ఉండటం వల్ల సింహ రాశి వారికి అక్షయ తృతీయ రోజున శుభప్రదమైన ఫలితాలు పొందుతారు అంటున్నారు జ్యోతిష్యశాస్త్ర పండితులు. వీరు చేసే పనుల్లో, కార్యాల్లో ఇంటి పెద్దల నుంచి సహకారం, ఆశీస్సులు పొందుతారని.. వీరి కుటుంబ జీవితంలో ఆనందం పెరుగుతుంది అంటున్నారు. అక్షయ తృతీయ రోజున మీరు బంగారం, రాగి వస్తువులను కొనడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయని చెబుతున్నారు. అంతేకాక అక్షయ తృతియ పర్వదినం రోజున వీరు ఊహించిన దాని కంటే ఎక్కువ సంపాదించగలరు అని తెలుపుతున్నారు.
వృశ్చిక రాశి వారికి అక్షయ తృతీయ రోజున ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది అంటున్నారు జ్యోతిష్యశాస్త్ర నిపుణులు. అక్షయ తృతీయ రోజున కొత్త వాహనం కొనాలని ఈ రాశి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. ఇల్లు, భూమి వంటి వాటిపై పెట్టుబడి పెట్టాలనుకుంటే, అక్షయ తృతీయ రోజున ఆ ప్రయత్నాలు కలిసి వస్తాయని అంటున్నారు. వీరికి ప్రయాణాలు కలిసి వస్తాయని చెబుతున్నారు.
గమనిక: ఇక్కడ అందించిన పరిహారాలు, సమాచారం మత విశ్వాసాల ఆధారంగా ఇచ్చినది. దీనికి, సుమన్‌టీవీకి ఎలాంటి సంబంధం లేదు. గమనించగలరు.