ఈ సంవత్సరంలో చివరిది.. అంతేకాకుండా ఈ ఏడాదిలో రెండోసారి సూర్యగ్రహణం ఏర్పడుతోంది. ఇది పాక్షిక సూర్యగ్రహణం మాత్రమే. ఈ పాక్షిక సూర్యగ్రహణం భారత్ సహా ఐరోపా, పశ్చిమాసియా, ఈశాన్య ఆఫ్రికన్ దేశాల్లో సంభవించనుంది. భారతదేశంలో కూడా కేవలం కొన్ని నగరాల్లో మాత్రమే ఈ గ్రహణం కనిపించే అవకాశాలు ఉన్నాయి. జ్యోతిష్యం ప్రకారం గ్రహణాలు అంటే సూర్యగ్రహణం కావొచ్చు, చంద్రగ్రహణం కావొచ్చు వీటిని అశుభకాలాలుగా చెప్పుకుంటారు. ఇలాంటి గ్రహణ సమయాల్లో కొన్ని పనులు చేయకూడదు అని చెబుతుంటారు. అలా చేయడం వల్ల అశుభ కలగడం మాత్రమే కాకుండా.. అనారోగ్య సమస్సలు తలెత్తే అవకాశం ఉందని చెబుతుంటారు.
గ్రహణం పట్టి ఉన్న సమయంలో పలు రాకల పనులు చేయకూడదని చెబుతుంటారు. వాటిలో ముఖ్యంగా గ్రహణం పట్టిన సమయంలో భోజనం చేయకూడదని సూచిస్తుంటారు. అంతేకాకుండా వంటగదిలోని ఆహార పదార్థాల్లో తులసి ఆకులు లేదా గరిక వేసుకోవాలని చెబుతుంటారు. గ్రహణ సమయంలో సూర్యభగవాణుడిని పూజిస్తూ, ఆయన పారాయణం చేయడం మంచిదంటారు. ముఖ్యంగా గర్భిణీలు చాలా జాగ్రత్తగా ఉండాలంటారు. గ్రహణం సమయంలో వారు ఎలాంటి పనులు చేయకూడదని సూచిస్తుంటారు. గ్రహణానికి ముందే భోజనం పూర్తి చేసుకుని.. గ్రహణం సమయంలో ప్రశాంతంగా విశ్రాంతి తీసుకోవాలని చెబుతుంటారు. ఈ సమయంలో పళ్లు శుభ్రంచేసుకోవడం, తల దువ్వుకోవడం లాంటివి చేయకూడదట.
అలాగే గ్రహణం తర్వాత తలస్నానం చేయాలని ప్రతీతి. పుణ్యనదుల్లో స్నానమాచరిస్తే ఇంకా మంచిది. లేదంటే పుణ్య నదుల నీటిని కలుపుకుని స్నానం చేసినా మంచిదే. అంతేకాకుండా గ్రహణం తర్వాత ఇంటిని శుభ్రం చేసుకోవాలి. ఎందుకంటే గ్రహణం అనేది మంచి ఘడియలు కాదని చెబుతుంటారు కాబట్టి.. గ్రహణం వీడిన తర్వాత ఇంటిని శుభ్రం చేసుకోవాలని సూచిస్తారు. అయితే ఎలా శుభ్రం చేసుకోవాలి? అనేది పెద్ద ప్రశ్న. సాధారణంగా ఇంటిని శుభ్రం చేసుకుని తర్వాత ఇంటి మూలల్లో గంగాజలాన్ని చల్లాలని చెబుతుంటారు. ఇలా గంగాజలాన్ని చల్లడం మూలంగా.. గ్రహణం సమయంలో కిరణాల వల్ల వచ్చే ప్రతికూల ప్రభావం తొలగిపోతుందని చెబుతుంటారు.