శివుడికి భక్తులంటే ప్రీతి. భక్తులకు శివుడంటే నమ్మకం. అందుకే భక్తులు ఆ మహాదేవుడిని ప్రతి రోజూ స్మరిస్తారిస్తూ నిత్యం శివరాత్రి జరుపుకొంటారు. ఆ భోళాశంకరుడిని ఎన్నిసార్లు సుత్తించినా తనివితీరదంటూ పక్షానికి, మాసానికీ, ఏడాదికీ.. ఒక్కో శివరాత్రి పేరుతో ఆ పరమేశ్వరుడికి అభిషేకిస్తారు. అయితే వాటన్నింటీలో “మాఘ బహుళ చతుర్ధశి” నాడు వచ్చే శివరాత్రి చాలా విశిష్టమైనది. అందుకే భక్తులంతా ఆరోజును “మహాశివరాత్రి”గా జరుపుకుంటారు. మహా శివరాత్రి సమీపిస్తుండటంతో భక్తులు ఆ పరమేశ్వరుడికి ప్రత్యేక పూజలకు సిద్ధమవుతున్నారు. అయితే స్వామికి పూజా క్రతువులో ముఖ్యమైన వాటిల్లో నైవేద్యం ఒకటి. ఆ పరమ శివుడికి శివరాత్రి రోజున ఏ ఆహార పదార్థాలు నైవేద్యంగా పెట్టాలో ఇప్పుడు తెలుకుందాం..
మహా శివరాత్రి రోజు ఆ పరమశివుడి పూజ విధానంలో నైవేద్యాన్ని ఐదో ఉపచారం లేదా ఆఖరి ఉపచారంగా చెబుతారు. ప్రసాదం అంటే శివుడికి ఎంతో భక్తితో , ప్రేమతో పదార్థాన్ని సమర్పించడం. నైవేద్యాన్ని ఎప్పుడు ఆ ఈశ్వరుడి కోసం ప్రత్యేకంగా వండి సమర్పించాలి. అంతే తప్ప బయటకొని తీసుకొచ్చిన పదార్థాలు లేదా మిగిలిన పదార్థాలను ప్రసాదంగా పెట్టరాదు. స్వామి వారికి సమర్పించే నైవేద్యం రెండు విధాలుగా ఉంటాయని పురాణాలు చెబుతున్నాయి. ఒకటి పక్వం, రెండు అపక్వం. పక్వం అంటే వండినవి మరియు అపక్వం అంటే వండనిది.
వండకుండా సమర్పించే ప్రసాదాల్లో కొబ్బరి కాయ శివుడికి ప్రీతి పాత్రమైనదిగా చెబుతారు. కొబ్బరి కాయాను ఆ ఈశ్వరుడి ముందు కొట్టి.. ఆ జలాన్ని లింగంపై ధారగా పోయాలి. దీనితో పాటు ఎండు ద్రాక్ష, అరటిపండ్లు, కర్జూరాలు పరమేశ్వరుడికి ఇష్టమైన ప్రసాదాలుగా చెబుతారు. వండి పెట్టే నైవేద్యానికి సంబంధించి పదార్థాల్లో పాయసం శివుడికి ఇష్టమైనది పండితులు చెబుతుంటారు. వీడితో పాటు ఉండ్రాలు, గుగ్గుళ్లు, అరిశలు వంటి స్వామి వారికి ప్రసాదాలు సమర్పిస్తారు. ఈ నైవేద్యాలు శివుడికి సమర్పించడం ద్వారా కష్టాలు తొలగి..సకల సుఖ, సంతోషాలు కలుగుతాయని నమ్ముతారు.
అయితే ఆ పరమేశ్వరుడిని పూజించే విషయంలో అందరు ఒక్కేలాగా చేయలేరు. వారి వారి ఆర్థిక స్థోమతను బట్టి పూజలు చేస్తుంటారు. శివుడి భోళశంకరుడు కాబట్టి తనపై జలం పోసి భక్తితో పూజ చేసినా ఆయన అనుగ్రహిస్తాడని ధర్మశాస్ర్తాలు పేర్కొంటాయి. ఏమి చేయకున్న ” ఓం నమశివాయ” అనే మంత్రం జపించినా ఆ సాంబశివుడు అనుగ్రహిస్తాడు అని శాస్త్రాలు చెబుతున్నాయి. మరి.. మహా శివరాత్రి రోజు చేసే పూజా విధానంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.