ఒక్కసారి జీవితంలో విజయం సాధించిన వారిని పరిశీలిస్తే.. ఎన్నో ఘోరమైన అవమానాలు, కష్టాలు దాటుకుని.. ఆ స్థాయికి చేరుకున్నవారే ఉంటారు. కానీ నేడు మనలో అపజయాలను తట్టుకునే ఓపిక, కష్టాలను భరించే సహనం నశిస్తుంది. ఏ సమస్యకైనా ఒకటే పరిష్కారం.. ఆత్మహత్య అన్నట్లుగా తయారయ్యింది పరిస్థితి. చిన్నలు, పెద్దలు అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరు క్షణికావేశంలో నిర్ణయాలు తీసుకుని.. జీవితాలను కడతేర్చుకుంటున్నారు. తాజాగా వైసీపీ నేత ఒకరు పదవి దక్కలేదన్న మనస్థాపంతో.. రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ వివరాలు..
ఇది కూడా చదవండి: అమ్మాయిలతో చిందులేసిన YSRCP సర్పంచ్..!
కుప్పం తిరుపతి గంగమ్మ ఆలయ మాజీ చైర్మన్ పార్థసారధి రైలుకింద పడి ప్రాణాలు తీసుకున్నారు. పార్థసారధి గతంలో కుప్పం తిరుపతి గంగమ్మ దేవస్థానం పాలకమండలి ఛైర్మన్‌గా పనిచేశారు. గురువారం గంగమ్మ దేవస్థానం కొత్త పాలకమండలి ప్రమాణస్వీకారం చేయబోతున్నారు. ఇదే సమయంలో.. పార్థ సారధి ప్రాణాలు తీసుకోవడం స్థానికంగా కలకలం రేపుతుంది. పదవి దక్కలేదనే మనస్తాపంతో పార్థసారధి ఆత్మహత్య చేసుకున్నట్లు స్థానికంగా చర్చించుకుంటున్నారు.
ఇది కూడా చదవండి: పోలీసులపై రెచ్చిపోయిన వైసీపీ ఎమ్మెల్యే!
గతంలో పార్థసారధిని గంగమ్మ ఆలయ పాలకమండలి ఛైర్మన్‌గా నియమించినా.. గత రెండేళ్లగా కరోనా కారణంగా ఆయన నామమాత్రపు ఛైర్మన్‌గా ఉన్నారట. ఈ కారణంతోనే మరోమారు తనకు ఛైర్మన్ పదవి ఇవ్వాలని కోరారట. కానీ మంజునాథ్ అనే వ్యక్తిని ఛైర్మన్‌గా నియమించి.. ఇదే పాలకమండలిలో పార్థసారధిని సభ్యునిగా నియమించారు. ఈ క్రమంలో తనకు ఛైర్మన్ పదవి ఇవ్వలేదనే మనస్తాపంతోనే ఆత్మహత్య చేసుకున్నట్టు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. విషయం తెలిసిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పార్థసారధి ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాల గురించి ఆరా తీస్తున్నారు.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.