జీవితంలో ఇలా బతకాలంటూ ఆ మహిళ ఎన్నో ఆశలతో అత్తింట్లో అడుగు పెట్టింది. కన్నవారిని, ఉన్నఊరిని కాదని అత్తింట్లో కాలు మోపింది. పెళ్లైన కొంత కాలం వరకు భర్త భార్యను బాగానే చూసుకున్నాడు. ఇక వెంట వెంట ఆ మహిళకు ఇద్దరూ కూతుళ్లే జన్మించారు. దీంతో భర్త, అత్తమామల నుంచి వేధింపులు తరుముకుంటు వచ్చాయి. వంశం నిలబడాలంటే ఓ మగ పిల్లాడిని కనాలంటూ సూటి పోటి మాటలతో వేధించేవారు. అయినా అన్ని వేధింపులను భరిస్తూ ఆ మహిళ సంసారాన్ని నెట్టుకుంటూ వచ్చింది. కానీ మితిమీరిన వేధింపులు ఎక్కువవడంతో ఆ మహిళ తట్టుకోలేక చివరికి ప్రాణాలను వదిలింది. ఇటీవల ఏపీలో చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదంగా మారింది. అసలేం జరిగిందనే పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
వైఎస్సార్ జిల్లా బనగానిపల్లె ప్రాంతంలో విష్ణుప్రియ, విజయ్ భార్యాభర్తలు నివాసం ఉంటున్నారు. వీరికి ఐదేళ్ల కిందట వివాహం జరిగింది. పెళ్లి సమయంలో విష్ణుప్రియ తల్లిదండ్రులు విజయ్ కి కట్న కానుకలు బాగానే ముట్టచెప్పారు. ఇక పెళ్లైన కొంత కాలం వరకు ఈ దంపతుల సంసారం బాగానే నడిచింది. కొన్నాళ్లకి ఈ దంపతులకు ఇద్దరు ఆడపిల్లలు జన్మించారు. ఇదిలా ఉంటే పెళ్లైన రెండు నెలల నుంచే భర్త అదనపు కట్నం కోసం భార్యను వేధింపులకు గురి చేసినట్లుగా తెలుస్తోంది. దీంతో పాటు వరుసగా ఆడపిల్లలే పుట్టడంతో భర్త విజయ్ తో పాటు అత్తామమలు సైతం సూటిపోటి మాటలతో వేధించేవారు.
మగపిల్లాడి కోసం నేను మరో పెళ్లి చేసుకుంటానని విజయ్ విష్ణు ప్రియను వేధించేవారు. ఈ క్రమంలోనే అత్తింటి వేధింపులు మితిమీరడంతో విష్ణు ప్రియ కొన్ని రోజులు పుట్టింటికి వెళ్లింది. ఇక పెద్దమనుషుల పంచాయితీలో ఈ దంపతులను మళ్లీ ఒక్కటి చేశారు. ఇక భర్త కొంత కాలం పాటు బాగానే ఉంటున్నట్లు భార్యతో నటించాడు. అదనపు కట్నం, రెండో పెళ్లి అంటూ విజయ్ మరోసారి భార్యతో గొడవకు దిగాడు. ఇక ఇన్నాళ్లు భరించిన విష్ణుప్రియ భర్త వేధింపులను తట్టుకోలేకపోయింది. ఈ నేపథ్యంలోనే విష్ణుప్రియ శనివారం ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు సమాచారం.
విష్ణుప్రియ ఆత్మహత్య వార్త తెలుసుకున్న ఆమె తల్లిదండ్రులు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకుని కన్నీరు మున్నీరుగా విలించారు. అనంతరం భర్త, అత్తమామలు మా కూతురిని హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని పోలీసులు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపడుతున్నారు. అయితే వీరి వాదన ఇలా ఉంటే అత్తింటివాళ్లు మాత్రం.., విష్ణుప్రియ కడుపు నొప్పి భరించలేకే ఆత్మహత్య చేసుకుందని చెబుతున్నారు. ఇటీవల చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదంగా మారింది. ఈ విషాద ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.