నవ మాసాలు మోసి కనిపెంచిన కొడుకు దూరమైతే ఏ తల్లి కూడా తట్టుకోదు. చెట్టంత కొడుకు కనిపించడు, ఇక ఎప్పటికీ రాడు అన్న వార్త విన్న ఏ తల్లి జీర్ణించుకోలేక వారి గుండెలు బరువెక్కుతాయి. అలా ఇటీవల చేతికందని కొడుకు మరణించాడని తెలియడంతో ఓ తల్లి తట్టుకోలేక కొడుకు మరణించిన గంటల వ్యవధిలోనే తనువు చాలించింది. ఈ విషాధ ఘటన వైఎస్సార్ జిల్లాలో చోటు చేసుకుంది. తాజాగా వెలుగు చూసిన ఈ ఘటన స్థానికుల కంట కన్నీరు తెప్పిస్తుంది.
పూర్తి వివరాల్లోకి వెళ్తే..ఒంటిమిట్ట మండలం కొత్త మాధవరం. ఇదే గ్రామానికి చెందిన బాలరాజు అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. అయితే ఇటీవల బాలరాజు మృకుందాశ్రమం సమీపంలో రైలు పట్టాలు దాటుతుండగా ప్రమాదవశాత్తు రైలు ప్రమాదానికి గురయ్యాడు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన బాలరాజ్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. దీనిని గమనించిన స్థానికులు వెంటనే అతడిని ఆస్పత్రికి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. కానీ అప్పటికే బాలరాజ్ మరణించాడని నిర్ధారించుకున్నారు.
ఇది కూడా చదవండి: Nalgonda: తాళికట్టిన భర్త కన్నా ప్రియుడే ఎక్కువనుకుంది.. చనువుతో అతనికి దగ్గరై!