ఈ ఫోటోలో కనిపిస్తున్న మహిళ పేరు లక్ష్మిదేవి. గతంలో ఓ వ్యక్తికి ఇచ్చి ఆమె తల్లిదండ్రులు పెళ్లి చేశారు. పెళ్లైన కొన్నాళ్లకి ఇద్దరు పిల్లలు కూడా జన్మించారు. కానీ కట్టుకున్నవాడితో లక్ష్మీదేవికి ఏనాడు కూడా ఆమె కోరుకున్న సుఖం దక్కలేదు. భర్త పరాయి మహిళల వ్యామోహంలో పడి భార్యను, పిల్లలను రోడ్డున పడేశారు. పుట పుటకు మద్యం తాగడం, భార్యను వేధింపులకు గురి చేయడం చేసేవాడు. ఇలా చేయొద్దంటూ భార్య ఎన్నో సార్లు మోత్తుకుంది. అయినా భర్తలో ఎలాంటి మార్పు లేకపోవడంతో పాటు వేధింపులు కూడా ఎక్కువయ్యాయి. దీంతో ఆ మహిళ భర్త తీరుతో విసిగిపోయి తీవ్ర మనస్థాపానికి గురైంది. ఏం చేయాలో తెలియక ఊహించని విషాదాన్ని మిగిల్చి వెళ్లిపోయింది. ఇటీవల వెలుగు చూసిన ఈ విషాద ఘటన స్థానికుల కంట కన్నీరును తెప్పిస్తుంది.
పోలీసులు తెలిపిన కథనం ప్రకారం.. వైఎస్సార్ జిల్లా దువ్వూరు మండలం పుల్లారెడ్డిపేట. ఇదే గ్రామానికి చెందిన పిట్టల శ్రీనివాసులుకు , సి రాజుపాలెంకు చెందిన లక్ష్మీదేవికి పదేళ్ల కిందట పెళ్లి జరిగింది. భర్త ఆటో నడుపుతూ కుటుంబాన్ని నెట్టుకొస్తున్నాడు. దీంతో కొంత కాలం పాటు వీరి దాంపత్య జీవితం సాఫీగా సాగడంతో వీరికి ఓ కూతురు, ఓ కుమారుడు జన్మించారు. ఇక కొన్ని రోజుల పాటు ఈ భార్యాభర్తలు సంతోషమైన కాపురాన్ని సాగించారు. లక్ష్మీదేవి కుటుంబంలో కొంత ఆర్థిక ఇబ్బందులు ఎదురయ్యాయి. దీంతో అక్కడి నుంచి ఎర్రగుంట్లకు వచ్చి మహేశ్వర్ నగర్ కాలనీలో నివాసం ఉంటున్నారు.
ఇది కూడా చదవండి: Madhya Pradesh: భర్తను కాదని ప్రియుడితో లేచిపోయిన భార్య.. గ్రామస్తులు ఎలాంటి శిక్షవిధించారో తెలుసా?
ఇక్కడికి వచ్చాక భర్త తీరులో ఊహించని మార్పు కనిపించింది. రోజు మద్యం తాగి వచ్చి భార్యను వేధించేవాడు. ఇక ఇంతటితో ఆగకుండా స్థానికంగా అనేక మంది మహిళలతో వివాహేతర సంబంధాన్ని నడిపించి ఎంజాయ్ చేసేవాడు. దీంతో భార్యను, పిల్లలను అస్సలు పట్టించుకోకుండా జులాయిగా తిరిగేవాడు. రోజూ తాగి రావడం, భార్యను కొట్టడం కూడా చేసేవాడు. భర్త తీరు భార్య లక్ష్మీదేవి విసిగిచెందింది. ఏం చేయాలో తెలియక స్థానికంగా ఉండే నీటి బావిలో పిల్లలను తోసేసి అనంతరం తాను కూడా దూకి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని నీటిలో ఉన్న తల్లి, కుమారుడు, కూతురు మృతదేహాలను బయటకు తీశారు. ఈ సమాచారాన్ని లక్ష్మీదేవి తల్లిదండ్రులకు చేరవేయడంతో అక్కడికి చేరుకుని కన్నీరు మున్నీరుగా విలపించారు. ఇటీవల వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదంగా మారింది. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.