కడప మంత్రి వైఎస్ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్‌పై తెలంగాణ కోర్టులో విచారణ సందర్భంగా సీబీఐ కీలక వ్యాఖ్యలు చేసింది. అవినాష్ రెడ్డికి ముందస్తు బెయిల్ ఇవ్వవద్దని కోర్టుకు తెలిపింది. సీబీఐ వాదనలు ఇలా ఉన్నాయి.
మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ముందుస్తు బెయిల్ పిటిషన్‌కు సంబంధించి తెలంగాణ హైకోర్టులో మంగళవారం విచారణ జరుగుతోంది. ఈ క్రమంలో సీబీఐ తరఫున న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. వివేకానందరెడ్డి హత్య కేసులో కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి పాత్ర ఉందని ఆరోపణలు చేశారు. ఇప్పటి వరకు వైఎస్ అవినాష్ రెడ్డిని నాలుగు సార్లు విచారించినట్టుగా సీబీఐ తరపు న్యాయవాది తెలిపారు. వివేకా హత్యకు రూ.40 కోట్ల లావాదేవీలు జరిగాయని.. వాటిపై విచారణ జరగాల్సి ఉందని సీబీఐ కోర్టుకు విన్నవించింది.
వివేకానందరెడ్డి గుండెపోటుతో చనిపోయారని చిత్రీకరించారని సీబీఐ తరపు న్యాయవాది న్యాయస్థానం దృష్టికి తీసుకువచ్చారు. అంతేకాక వివేకానందరెడ్డి హత్య జరిగిన రోజున అవినాష్ రెడ్డి ఇంట్లోనే ఉన్నారని సీబీఐ కోర్టుకు తెలిపింది. వివేకానందరెడ్డిపై దాడి చేసిన తర్వాత సునీల్ యాదవ్, వైఎస్ అవినాష్ రెడ్డి ఇంటికి వెళ్లిపోయారని ఈ సందర్భంగా సీబీఐ న్యాయవాది కోర్టుకు తెలిపారు. వైఎస్ వివేకానందరెడ్డి హత్య జరిగిన రోజున వైఎస్ అవినాష్ రెడ్డి ఫోన్ యాక్టివిటీస్ ఈ కేసులో కీలకంగా ఉన్నాయని సీబీఐ కోర్టుకు తెలిపింది.
అంతేకాక వివేకానందరెడ్డి హత్యకు రూ. 40 కోట్ల లావాదేవీలు జరిగాయని.. వాటిపై విచారణ జరగాల్సి ఉందని సీబీఐ న్యాయవాది ఈ సందర్భంగా కోర్టుకు తెలిపారు. వివేకానందరెడ్డి హత్య వెనుక జరిగిన కుట్రను వెలికితీసే ప్రయత్నం చేస్తున్నామన్నారు. అంతేకాక వివేకానందరెడ్డి హత్య కేసుతో వైఎస్ అవినాష్ రెడ్డికి సంబంధం ఉందని.. ఇందుకు ఆధారాలున్నాయని సీబీఐ స్పష్టం చేసింది. కనుక అవినాష్ రెడ్డికి ముందస్తు బెయిల్ మంజూరు చేయాల్సిన అవసరం లేదని సీబీఐ తరఫు న్యాయవాది కోర్టుకు విన్నవించారు. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు చార్జీషీట్‌లోనే ఈ విషయాన్ని పేర్కొన్నట్టుగా సీబీఐ న్యాయవాది గుర్తు చేశారు.
ఇక ఇప్పటివరకు నిర్వహించిన విచారణలో అవినాష్ రెడ్డి సీబీఐకి సహకరించలేదని, సరైన సమాధానాలు చెప్పలేదని సీబీఐ వెల్లడించింది. వివేకానందరెడ్డి గుండెపోటుతో మరణించినట్టుగా చూపించే ప్రయత్నం చేశారని ఈ సందర్భంగా సీబీఐ ఆరోపించింది. అంతేకాక వివేకానందరెడ్డి మృతదేహనికి బ్యాండేజీలు కట్టిన విషయాన్ని ఈ సందర్భంగా సీబీఐ తరపు న్యాయవాది కోర్టులో ప్రస్తావించారు. ఉదయ్ కుమార్ రెడ్డి తండ్రి జయప్రకాష్ రెడ్డితో ఈ బ్యాండేజీ కట్టించారని తెలిపారు.