Hyderabad: ఈ మధ్య కాలంలో చిన్న చిన్న సమస్యలకు కూడా చావును పరిష్కారంగా భావించటం ఎక్కువయిపోయింది. అది, ఇది అని కాకుండా ప్రతీ చిన్న కారణానికి మరణానాన్ని ఆశ్రయిస్తున్నారు కొందరు. తాజాగా, హైదరాబాద్‌లో వర్షిత అనే బాలిక కుటుంబ కలహాల నేపథ్యంలో ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. సదరు బాలిక భవనంపై నుంచి దూకి ప్రాణాలు తీసుకుంది. ఈ ఘటన మరవక ముందే ఓ వింతైన ఆత్మహత్య ఘటన వెలుగుచూసింది. యూట్యూబ్‌లో వ్యూస్ పెరగట్లేదని ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన హైదరాబాద్‌లో బుధవారం చోటుచేసుకుంది.
పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. నగరంలోని సైదాబాద్‌కు చెందిన డీనా ఐఐటీ గ్వాలియర్‌లో ఇంజనీరింగ్ చదువుతున్నాడు. చదువుకుంటూనే మరో వైపు యూట్యూబ్‌లో ఓ గేమ్ ఛానల్ నిర్వహిస్తున్నాడు. నెలలు గడుస్తున్నా వ్యూయర్స్ పెరగట్లేదు. ఈ నేథప్యంలో డీనా కలత చెందాడు. తన బాధను బుధవారం యూట్యూబ్ లైవ్‌లోకి వచ్చి సబ్‌స్క్రైబర్లతో పంచుకున్నాడు.
అనంతరం భవనం పైనుంచి కిందకు దూకాడు. తల బలంగా నేలకు తగలటంతో అక్కడికక్కడే మరణించాడు. ఆత్మహత్యకు ఎనిమిది గంటల ముందు ఓ సూసైడ్ నోట్‌ను యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేశాడు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మరి, ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : Infant: గర్భిణిపైనుంచి దూసుకెళ్లిన ట్రక్కు.. కడుపులోంచి బయటపడ్డ బిడ్డ!