నేటి సమాజంలో మనుషులు ప్రతి పనిలోనూ ఎంతో ఒత్తిడికి లోనవుతున్నారు. ఆర్థిక కష్టాలు, ప్రేమ వ్యవహారాలు, భార్యభర్తల మద్య వచ్చే గొడవలతో మానసిక వత్తిడికి లోను కావడంతో ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితిలోకి వెళ్తున్నారు.
గత కొంత కాలంగా సినీ ఇండస్ట్రీలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. చిన్న చిన్న కారణాలతో డిప్రేషన్ లోకి వెళ్లిపోయి చనిపోతున్నారు. ఆర్థిక కష్టాలు, ప్రేమ వ్యవహారాలు, భార్యభర్తల మద్య వచ్చే గొడవలతో మానసిక వత్తిడికి లోను కావడం.. ఆత్మహత్య చేసుకోవడం లాంటివి జరుగుతున్నాయి. ఛత్తీస్‌గఢ్‌లోని ఓ యూట్యూబర్ తన ఇంట్లో శవమై కనిపించింది. మృతురాలు ఇషికా శర్మగా గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టారు. వివరాల్లోకి వెళితే..
చత్తీస్ గఢ్ చంపాలో ప్రాంతంలో ఓ యూట్యూబర్ తన ఇంట్లో బెడ్ రూమ్ లో అనుమానాస్పద స్థితిలో చనిపోయింది. ఆమె పేరు ఇషికా శర్మ.. గత కొంత కాలంగా యూట్యూబర్ గా బాగా పాపులారిటీ సంపాదించింది. ఇషికా మరణించిన విషయం కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. ఇషికా మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం తరలించారు. కాగా, ఆమెపై భౌతిక దాడి జరిగిందని.. ఊపిరాడకపోవడం వల్ల చనిపోయినట్లు రిపోర్ట్స్ వెల్లడించాయి. చనిపోవడానికి ఒకరోజు ముందు ఇషిక, ఆమె సోదరుడు ఓ హూటల్ కి వెళ్లి డిన్నర్ చేసినట్లు ప్రాథమిక విచారణలో తేలింది.
ఇషికా మరణం వెనుక ఎవరి హస్తమైనా దాగి ఉందా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ నేరంలో ప్రధాని నిందితులుగా ఆమె తోబుట్టువులతో పాటు మరికొంతమంది ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. హూటల్ వద్ద ఉన్న సీసీ టీవీ ఫుటేజ్ లను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఇషికా మరణించే సమయానికి ఆమె తల్లిదండ్రులు కోర్బాలో ఉన్నారు. ఆదివారం ఆమె తల్లితో చివరిసారిగా మాట్లాడినట్లు పోలీసులు తెలిపారు. సోమవారం ఆమె కుటుంబ సభ్యులు ఇషికా కి ఫోన్ చేయగా ఆమె స్పందించకపోవడంతో అనుమానం వచ్చి ఇషిక బెడ్ రూమ్ తలుపులు తెరిచి చూడగా ఆమె చనిపోయి ఉంది. స్క్వాడ్, ఫింగర్ ప్రింట్ నిపుణులతో కలిసి పోలీసులు విచారణ చేపట్టారు.