నిజమాబాద్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఓ ఆస్పత్రి భవనంలోని ఓ యువతికి నలుగురు యువకులు మద్యం తాగించి ఆపై అత్యాచారానికి దిగి పరారయ్యారు. తాజాగా జరిగిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారింది. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే.. నిజమాబాద్ జిల్లా బస్టాండ్ పరిధిలోని ఓ ఆస్పత్రి గదిలో ఉంటున్న యువతిపై నలుగురు యువకులు కన్నేశారు.
విషపూరితమైన ఆలోచనలతో నిండిన దుండగులు ఆ యువతికి బలవంతంగా మద్యం తాగించారు. ఇక ఆ యువతి మత్తులోకి వెళ్లిన అనంతరం నలుగురు దుర్మార్గులు ఒకరి తర్వాత ఒకరు సామూహిక అత్యాచారానికి ఒడిగట్టారు. ఇక గమనించిన స్థానికులు వెంటనే ఆ యువతిని వైద్యం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అపస్మారక స్థితిలో పడి ఉందని డాక్టర్లు తెలియజేస్తున్నారు. కాగా స్థానికుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు పరారీలో ఉన్న నిందితుల కోసం గాలిస్తున్నారు.