East Godavari: ఆ యువతి ఉన్నత చదువులు చదవాలని కలలు కనింది. కానీ, కుటుంబ ఆర్థిక పరిస్థితులు కారణంగా ఉద్యోగం చేయాల్సిన గత్యంతరం ఏర్పడింది. దీంతో ఉన్నత చదువులు చదవలేని జీవితం తనకు వద్దనుకుంది. పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన తూర్పు గోదావరి జిల్లాలో శనివారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. తూర్పుగోదావరి జిల్లా నందమూరుకు చెందిన యంగల శ్రీదేదీప్య ఏలూరులో ఎమ్మెస్సీ న్యూట్రీషియన్ చదవింది. విశాఖపట్నంలోని సెవెన్‌హిల్స్ ఆసుపత్రిలో రెండు నెలలు ఇంటర్న్ షిప్ పూర్తి చేసింది. ఇంటర్న్ షిప్ పూర్తి కావటంతో శుక్రవారం స్వస్థలం చేరుకుంది. ఈ నేపథ్యంలో ఆమెకు సెవెన్ హిల్స్ ఆసుపత్రిలో ఉద్యోగం వచ్చినట్లు కబురందింది.
అయితే, తనకు జాబ్ చేయటం ఇష్టం లేదని, హీహెచ్‌డీ చేస్తానని తండ్రి చినబాబుకు చెప్పింది. ఆయన కూతురు ఇష్టాన్ని అంగీకరించలేకపోయాడు. కుటుంబ ఆర్థిక పరిస్థితులు బాగోలేనందున జాబ్‌లో చేరాలని సూచించారు. దీంతో శ్రీదేదీప్య కలత చెందింది. ఉన్నత చదువులు చదవలేని జీవితం తనకు వద్దనుకుంది. పురుగుల మందు తాగి ఆత్మహత్యకు ప్రయత్నించింది.
శనివారం తెల్లవారుజామున నోటినుంచి నురగలు కక్కుతున్న కూతుర్ని చూశాడు చినబాబు. వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లాడు. అక్కడ చికిత్స పొందుతూ శ్రీదేదీప్య కన్నుమూసింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. చీమల మందు తాగి ఆత్మహత్య చేసుకుని ఉండొచ్చని భావిస్తున్నారు. మరి, ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్లరూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : Social Media Influencer: పరాయి వ్యక్తితో భార్య! అది చూసి తట్టుకోలేకపోయిన భర్త ఆమె చేతులు కాళ్లు కట్టేసి..