నేటి కాలం యువత ప్రేమ పేరుతో జులాయిగా తిరుగుతూ జీవితాన్ని చిన్న వయసులోనే నాశనం చేసుకుంటున్నారు. తెలిసి తెలియని వయసులో ప్రేమలో పడడం, తల్లిదండ్రులు మందలిస్తే ఆత్మహత్యలు, ఇల్లు వదిలి వెళ్లడం. ఇవే ఈ రోజుల్లో జరుగుతున్న ఘటనలు. ఇలాగే ఓ యువకుడితో చాటింగ్ చేస్తున్న యువతి వ్యవహారం తల్లిదండ్రులకు తెలియడంతో మందలించారు. దీనికి తీవ్ర మనస్థాపానికి గురైన ఆ యువతి ఇంట్లో నుంచి కనిపించకుండ పోయిన ఘటన రంగారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది.
పోలీసుల కథనం మేరకు.. రంగారెడ్డి జిల్లా చేవేళ్ల మండలం గొల్లపల్లి. ఇదే గ్రామానికి చెందిన పల్లె మహేశ్వరి(20) తల్లిదండ్రులతో పాటు నివాసం ఉంటుంది. అయితే స్థానికంగా ఉండే సందీప్ అనే యువకుడితో మహేశ్వరి చాటింగ్ చేస్తున్నట్లుగా తల్లిదండ్రులు గుర్తించారు. ఈ నేపథ్యంలోనే పనికిమాలిన విషయాలు పక్కన బెట్టి జీవితం మీద దృష్టి పెట్టాలని తల్లిదండ్రులు మహేశ్వరిని మందలించారు. ఇక అప్పటి నుంచి మహేశ్వరి శుక్రవారం ఇంట్లో నుంచి కనిపించకుండపోయింది.
రాత్రి అయిన కూతురు ఇంటికి చేరుకోకపోవడంతో తల్లిదండ్రులు ఖంగారుపడ్డారు. అటు ఇటు అంతా వెతికారు. ఎంత వెతికినా కూడా మహేశ్వరి జాడ కనిపించకపోవడంతో సందీప్ పైనే అనుమానం ఉందని పోలీసులకు ఫిర్యాదు చేశారు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమవుతోంది. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.