హైదరాబాద్ నల్లకుంటకు చెందిన ఈ యువతి స్థానిక ఓ ప్రైవేట్ స్కూల్ ఉపాధ్యాయురాలిగా విధులు నిర్వర్తిస్తున్నారు. ఎప్పటిలాగే ఈ నెల 26న స్కూల్ కు వెళ్లింది. కానీ, ఆ రోజు రాత్రి అయినా ఆ యువతి తిరిగి ఇంటికి రాలేదు. అసలేం జరిగిందంటే
ఈ యువతి పేరు వహెద ఉన్నిస. వయసు 18 ఏళ్లు. కొంత వరకు చదువుకుంది. ఈమె గత కొన్ని రోజుల నుంచి స్థానికంగా ఉన్న ఓ ప్రైవేట్ స్కూల్ లో టీచర్ గా విధులు నిర్వర్తిస్తున్నారు. ఇక ఎప్పటిలాగే ఈ నెల 26న స్కూల్ కు వెళ్లింది. కానీ, తిరిగి మళ్లి ఇంటికి రాలేదు. ఉన్నిస తల్లిదండ్రులు ఆమెకు చాలా సార్లు ఫోన్ చేశారు. అయినా స్పందించలేదు. బంధులకు ఫోన్ చేసి ఉన్నిస ఆచూకి గురించి అడిగి తెలుసుకున్నారు. ఎక్కడ కూడా ఆమె సమాచారం లభించలేదు. అసలేం జరిగిందంటే?
పోలీసుల కథనం ప్రకారం.. హైదరాబాద్ నల్లకుంట పరిధిలోని అంజయ్య నగర్ లో వహెద ఉన్నిస (18) అనే యువతి తల్లిదండ్రులతో పాటు నివాసం ఉంటుంది. కొంత వరకు చదువుకున్న ఈ యువతి.. ఇంట్లో ఆర్థిక ఇబ్బందుల నేపథ్యంలో స్థానికంగా ఉన్న ఓ ప్రైవేట్ స్కూల్ లో ఉపాధ్యాయురాలిగా చేరింది. రోజూ స్కూల్ వెళ్తూ వస్తూ ఉండేది. అలా కొంత కాలం నుంచి ఉన్నిస అదే స్కూల్ లో పని చేసింది. ఇదిలా ఉంటే, ఈ నెల 26న ఉన్నిస ఎప్పటిలాగే స్కూల్ కు వెళ్లింది. కానీ, సాయంత్రం అయినా తిరిగి ఇంటికి రాలేదు. దీంతో తల్లిదండ్రులు ఉన్నిసకు చాలా సార్లు ఫోన్ చేసినా సమాధానం ఇవ్వలేదు. ఇక దగ్గరి బంధువులకు ఫోన్ చేసి ఉన్నిస ఆచూకి గురించి అడిగి తెలుసుకున్నారు. ఎటువంటి సమాచారం అందలేదు. ఇక చేసేదేం లేక ఆ యువతి తల్లిదండ్రులు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఉన్నట్టుండి కూతురు కనిపించకపోవడంతో ఆ యువతి తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.