మనిషి తీసుకునే తొందరపాటు నిర్ణయాల వల్ల ఎన్నో కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. కొందరు మహిళలు భర్త చీర కొనివ్వలేదని, సినిమాకు తీసుకెళ్లలేదని ఇలా చిన్న చిన్న కారణాలతో నిండు జీవితాన్ని బలితీసుకుంటున్నారు. ఇలాంటి ఘటనే ఒకటి గుంటూరు జిల్లాలో చోటు చేసుకుంది. పిడుగురాళ్ల పట్టణంలోని మిలటరీ కాలనీలో నివాసముంటున్నారు మానస, శ్రావణ్‌కుమార్ అనే భార్యభర్తలు. ఎనిమిది సంవత్సరాల క్రితం వీరికి వివాహం జరిగింది. కొనాళ్లకు వీరికి జ్యోతి(2), షర్మిల(4) అనే ఇద్దరు కుమార్తెలు కూడా జన్మించారు.
పిల్లా పాపలతో వారి కుటుంబం హాయిగా సాగుతోంది. కానీ మానసకు మాత్రం దైవ దర్శనం కోసం తిరుపతి వెంకటేశ్వరస్వామిని దర్శించుకోవాలనే కోరిక మాత్రం ఆమె మనసులో బలంగా ఉంది. ఇదే విషయమై భర్త ముందు పలుమార్లు విన్నవించుకుంది భార్య మానస. దీనికి భర్త శ్రావణ్‌కుమార్ అంగీకరించలేదు. ఇక కొన్నాళ్ల తర్వాత భార్య కోరికను నెరవేర్చేందుకు శ్రావణ్ కుమార్ అంగీకరించాడు. ఒక రోజనుకుని వెళ్దామని అందరూ పయనం అయ్యారు. కానీ అనుకోకుండా భర్త పని మీద బయటకు వెళ్తున్నానని మా అమ్మతో వెళ్లమని కబురు పంపాడు.
దీంతో ఆ యువతి కాస్త నిరాశకు గురై తిరుపతి ప్రయాణాన్ని వాయిదా వేసుకుంది. భర్త తన నా నిర్ణయాన్ని స్వాగతించటం లేదని, నా మాట వినటం లేదని భావించిన భార్య మానస ప్రతి రోజు కృంగిపోతూ ఏడుస్తూ ఉండేది. భర్తతో సరిగ్గా మాట్లాడకపోవటం, నిద్రపోకుండా ధీనమైన స్థితిలోకి వెళ్లిపోయింది. ఇక ఒక రోజు భర్త ఒక రూంలో పడుకున్నాడు. పిల్లలతో మానస మరో రూంలో పడుకుంది. అర్ధరాత్రి అందరూ పడుకున్న తర్వాత నిద్ర లేచింది భార్య మానస. మెల్లగా తన ఇద్దరు పిల్లల మెడకు చున్ని చుట్టి వేలాడదీసింది. దీంతో ఇద్దరు పిల్లలను హతమార్చిన ఆ తల్లి అనంతరం తను కూడా ఇంట్లో ఉన్న ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది.
దీంతో తెల్లారేసరికి భార్య పిల్లలు ఇంకా నిద్రలేవలేదని భర్త తలుపు తెరిచి చూశాడు. విగత జీవులుగా పడి ఉన్న ఇద్దరు పిల్లలు, తన భార్యను చూసిన భర్త ఒక్కసారిగా షాక్‌కు గురయ్యాడు. దీంతో భర్త శ్రావణ్‌కుమార్ ఏడుస్తున్న శబ్దాన్ని గ్రహించిన పక్కింటివాళ్లు హఠాత్తుగా ఇంట్లోకి వచ్చి చూసేసరికి విషాద ఘటన బయటపడింది. దీంతో స్థానికుల పోలీసులకు సమాచారం ఇవ్వటంతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.