కరోనా ప్రభావంతో ఎంతో మంది ఉద్యోగాలు ఊడిపోయిన పరిస్థితి ఏర్పడింది. దీంతో ఇప్పటికీ ఎంతో మంది యువతీ యువకులకు ఉద్యోగాలు లేక రోడ్డున పడ్డారు. అలా ఓ యువతి ఆన్ లైన్ ట్రేడింగ్ లో బిజినెస్ లో అడుగుపెట్టబోయి బొక్కబోర్ల పడింది. తాజాగా జరిగిన ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.
ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే..అది కర్నూలు జిల్లా శిరివెళ్ల మండలంలోని ఓమారుమూల గ్రామం. ఈ గ్రామానికి చెందిన యువతికి ఇటీవల విశాఖపట్నం జిల్లాకు చెందిన రాజేష్ వరుణ్ అనే యువకుడు టెలిగ్రామ్ ద్వారా పరిచయమయ్యాడు. ఈ పరిచయం కాస్త బిజినెస్ చేసుకునే స్థాయికి చేరుకుంది. దీని కారణంగా అతడిని నమ్మి ఆ యువతి ఆన్ లైన్ ట్రేడింగ్ లో డబ్బులు పెట్టింది. అధిక వడ్డీ ఇప్పాస్తానంటూ రాజేష్ వరుణ్ ఆ యువతిని నట్టేట్టముంచాడు.
ఇక మొత్తానికి లక్షా యాభై వేల రూపాయలు తీసుకుని ఎక్కువ వడ్డీ ఇప్పిస్తానన్నాడు. దీంతో కొంత కాలం తర్వాత ఆ యువతి డబ్బులు అడిగితే రాజేష్ ఏకంగా బ్లాక్ మెయిల్ కు దిగాడు. ఇక రోజు వేధిస్తూ న్యూడ్ వీడియోలు, పంపాలంటూ వేధించేవాడు. దీంతో ఏం చేయని పరిస్థితుత్లో ఆ యువతి డబ్బులు ఇవ్వడేమోనని భావించి భయంతో అతను కోరినట్టు వీడియోలు పంపటం మొదలు పెట్టింది. అలా రోజు వేధిస్తూ.. పంపిన వీడియోలను సేవ్ చేసుకుని డబ్బులు డిమాండ్ చేశాడు.
అలా కొంత కాలం వరకూ గడిచిన ఆ యువతికి డబ్బులు మాత్రం ఇవ్వకుండా ఇంకా అదనంగా డబ్బులు డిమాండ్ చేస్తూ కాలం గడిపాడు. దీంతో ఎట్టకేలకు యువతి మేలుకొని మోసపోయానని గ్రహించి పోలీసులకు ఫిర్యాదు చేసింది. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు రాజేష్ ను అరెస్ట్ చేసి దర్యాప్తు చేస్తున్నారు.