crime news: నేటి యువతకు జీవితం అంటే ఏంటో ఇంకా అర్థం కావటం లేదు. కోరుకుంది దక్కకపోతే ఇక జీవితమే వ్యర్థం అన్నట్లుగా ఫీలవుతున్నారు. ఆ బాధలో ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. తాజాగా, ఓ కుర్రాడు తాను ప్రేమించిన అమ్మాయి పెళ్లికి ఒప్పుకోలేదని తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. గొంతు కోసుకుని ఆత్మహత్యకు ప్రయత్నించాడు. ఈ సంఘన తెలంగాణలోని కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండలానికి చెందిన ఓ యువకుడు డిగ్రీ చదువుతున్నాడు. అదే ప్రాంతానికి చెందిన ఓ యువతిని ప్రేమిస్తున్నాడు. శుక్రవారం తన ప్రేమను సదరు యువతికి చెప్పి, పెళ్లి చేసుకుంటానని అడిగాడు. అయితే, ఆ యువతి అతడి ప్రేమను, పెళ్లిని తిరస్కరించింది. దీంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు.
తాను కట్టుకున్న కలల సౌథం ఒక్కసారిగా కూలిపోవటంతో తట్టుకోలేకపోయాడు. ఇక బ్రతికి లాభం లేదని నిశ్చయించుకుని ఆత్మహత్య చేసుకుందామని డిసైడ్ అయ్యాడు. అదే రోజు బ్లేడుతో గొంతుకోసుకున్నాడు. ఈ దృశ్యాలను వీడియో తీసి స్నేహితులకు పంపాడు. ఆ వీడియో చూసిన ఫ్రెండ్స్ ఒక్కసారిగా షాక్ అయ్యారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన పోలీసులు పది నిమిషాల్లో సంఘటనా స్థలానికి చేరుకున్నారు. బాగా రక్తం పోయి స్ప్రహ కోల్పోయిన అతడ్ని ఆసుపత్రికి తరలించారు. ఆ యువకుడు ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్సపొందుతున్నాడు. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : యాక్సిడెంట్ లో భర్త మృతి! పోలీసులు కూడా ఊహించని ట్విస్ట్!
ఇండస్ట్రీలో దారుణం.. ప్రముఖ నటిపై అత్యాచారం!
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.