Young Girl: ప్రియుడి అప్పులు తీర్చటానికి దొంగగా మారిందో యువతి. ప్రియుడితో కలిసి దొంగతనాలకు పాల్పడింది. ఈ సంఘటన తమిళనాడులో ఆలస్యంగా వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. తమిళనాడులోని తొండముత్తుర్‌కు చెందిన ప్రసాద్, తేజస్విని బీటెక్ చదువుతున్నారు. ఇద్దరూ గత కొన్నేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ప్రసాద్, తేజస్విని బాగా డబ్బున్న కుటుంబాలకు చెందిన వారు. అయితే, ప్రసాద్ తన చెడు వ్యసనాల కారణంగా పెద్ద మొత్తంలో అప్పుల పాలయ్యాడు. అంత పెద్దమొత్తం డబ్బును ఇంట్లో అడగలేకపోయాడు. దీంతో దొంగతనాలు చేసి అప్పులు తీర్చాలనుకున్నాడు. ప్రియురాలిని కూడా తనతో పాటు దొంగతనాలు చేయటానికి ఒప్పించాడు. ఇద్దరూ కలిసి చైన్లు దొంగిలించటం మొదలుపెట్టారు.
ప్రసాద్ ఆఖరికి సొంత ఇంట్లో కూడా చైన్ దొంగతనం చేశాడు. ప్రసాద్, తేజస్విని కొద్దిరోజుల క్రితం కలియఅమ్మాల్ ఏరియాలోని రోడ్డు పక్క మేకలు కాస్తున్న ఓ మహిళ దగ్గరకు వెళ్లారు. ఓ అడ్రస్ చెప్పాలంటూ ఆమెను అడిగారు. ఆమె అడ్రస్ చెబుతుండగా ప్రసాద్ ఆమె మెడలోని చైన్‌ను లాగేశాడు. ఆ తర్వాత ఇద్దరూ అక్కడినుంచి పరారయ్యారు. సదరు మహిళ దీనిపై వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా ప్రసాద్, తేజస్వినిలను అదుపులోకి తీసుకున్నారు. మరి, ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : Crime News: ఫేయిల్ చేస్తానని భయపెట్టి, బాలుడిపై ఉపాద్యాయుడి అత్యాచారం
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.