ఆ యువతికి అతడంటే ఎంతో ఇష్టం. ప్రాణం కన్న ఎక్కువగా ప్రేమించింది. కన్నవాళ్లను కాదన్న ప్రేమించిన ప్రియుడితోనే ఉండాలనుకుంది. కానీ, పరిస్థితులు తారుమారు కావడంతో ఈ యువతి ప్రేమకథ చివరికి ఊహించని మలుపుకు తిరిగింది. ఇటీవల వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదంగా మారింది. ఈ లవ్ స్టోరీలో అసలేం జరిగిందనే పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. పైన ఫొటోలో కనిపిస్తున్న యువతి పేరు కాకల్ల మౌనిక. వయసు 20 ఏళ్లు. యాదాద్రి భువనగిరి జిల్లా రాజంపేట మండలం పాముకుంటలో తల్లిదండ్రులతో పాటు నివాసం ఉంటుంది.
అయితే ఈ యువతి స్థానికంగా ఉండే ఓ యువకుడిని గత కొంత కాలంగా ప్రేమిస్తుంది. ఆ యువకుడు కూడా ఈ యువతిని ప్రేమించాడు. అలా ఇద్దరు కొంత కాలం పాటు ప్రేమించుకున్నారు. అయితే ఉన్నట్టుండి ఆ యువతి ప్రియుడు మరో యువతితో పెళ్లికి రెడీ అయ్యాడు. ఇటీవల నిశ్చితార్థం కూడా జరిగింది. ప్రాణంగా ప్రేమించిన ప్రియుడు దక్కడం లేదని ఆ యువతి తీవ్ర మనస్థాపానికి గురైంది. ఈ క్రమంలోనే మౌనిక ఈ నెల 1 నుంచి కనిపించకుండపోయింది. దీంతో ఖంగారుపడి మౌనిక తల్లిదండ్రులు అంతటా వెతికారు. అయినా.. కూతురి జాడ మాత్రం దొరకలేదు.
కట్ చేస్తే ఈ నెల 3న అదే ఊరిలో ఉన్న ఓ బోరుబావిలో మౌనిక శవమై కనిపించింది. ఈ విషయం తెలుసుకున్న ఆ యువతి తల్లిదండ్రులు గుండెలు పగిలేలా ఏడ్చారు. గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని ఆ యువతి మృతదేహాన్ని బయటకు తీశారు. అనంతరం పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఆ తర్వాత ఈ ఘటనపై మృతురాలి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇటీవల వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదంగా మారింది. ప్రియుడు దక్కలేదని ఆత్మహత్య చేసుకున్న ఆ యువతి నిర్ణయంపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.