ఈ మధ్యకాలంలో చాలా మంది అధికారులు బాధ్యతాయుతంగా ప్రవర్తిస్తున్నారు. మరీ ముఖ్యంగా విద్యా వ్యవస్థలో పని చేస్తున్న ఉపాధ్యాయుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. బాలుడు స్కూల్ లోనే మూత్ర విసర్జన చేస్తున్నాడని కాల్చి వాతలు పెట్టడం, అల్లరి చేస్తున్నాడని చచ్చేంత కొట్టడం వంటి ఘటనలు ఇటీవల వెలుగు చూశాయి. అయితే ఇది మరువక ముందే తాజాగా మరో ఘటన వెలుగులోకి వచ్చింది.
విషయం ఏంటంటే? అది యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం రాంపూర్ లో ఉన్న ప్రభుత్వ కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయంలో స్కూల్ పిల్లలతో బియ్యం సంచులు మొపించినట్లు ఇటీవల వార్తా కథనాలు వెలువడ్డాయి. అయితే వీటిపై స్పందించిన స్థానిక మహిళా సర్పంచ్ అసలు ఏం జరుగుతుందని తెలుసుకునేందుకు ఆ విద్యాలయంలోకి వెళ్లే ప్రయత్నం చేసింది. కానీ అక్కడికి చేరుకోగానే ఆ స్కూల్ వార్డెన్ ఆ మహిళా సర్పంచ్ ను లోపలికి వెళ్లకుండా అడ్డుకున్నాడు. ఇంతటితో ఆగకుండా గంటపాటు ఎండలోనే బయట నిలబెట్టాడు.
ఏంటని ప్రశ్నించగా స్థానిక విద్యా అధికారులే లోపలికి రానివ్వకూడదని చెప్పారని, దీంతోనే ఎవరినీ కూడా లోపలికి రానివ్వడం లేదని ఉపాధ్యాయులు తెలిపినట్లుగా తెలుస్తోంది. విద్యార్థుల సమస్యలపై తెలుసుకునేందుకు వెళ్తే.. నన్ను ఘోరంగా అవమానించారని ఆ మహిళా సర్పంచ్ ఆవేదన వ్యక్తం చేస్తోంది. ఇలాంటి దారుణాలపై ఉన్నతాధికారులు వెంటనే స్పందించి వారిపై చర్యలు తీసుకోవాలని ఆమె మండిపడ్డారు. ఇటీవల చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమవుతోంది. ఈ ఘటనపై మీ అభిప్రాయలను కామెంట్ రూపంలో తెలియజేయండి.