ఈమె పేరు బసవరేఖ. వయసు 26 ఏళ్లు. 10 ఏళ్ల కిందటే మేనబావతో పెళ్లి జరిగింది. పెళ్లైన చాలా కాలం పాటు ఈ దంపతులు సంతోషంగానే జీవించారు. కట్ చేస్తే.. భర్త తరుచు అనుమానిస్తూ వేధింపులకు గురి చేసేవాడు. ఈ క్రమంలోనే తట్టుకోలేకపోయిన ఆ ఇల్లాలు సంచలన నిర్ణయం తీసుకుంది. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
ఎంతో పవిత్రమైన వివాహ బంధానికి కొందరు భార్యాభర్తలు తూట్లు పొడుస్తున్నారు. అనుమానం పేరుతో వేధించడం, వివాహేతర సంబంధాలు వంటి రక రకాల కారణాలతో దంపతులు మధ్యలోనే విడిపోతున్నారు. సమాజంలో ఇలాంటి ఘటనలు చాలానే చోటు చేసుకుంటున్నాయి. ఇదిలా ఉంటే… ఓ భర్త మద్యం తాగి రోజూ భార్యను వేధించేవాడు. ఇన్నాళ్లు భరించిన ఆ ఇల్లాలు ఇక భరించలేక ఊహించని నిర్ణయం తీసుకుంది. దీంతో కోర్టు ఆమెకు ఊహించిన శిక్ష విధించింది. అసలేం జరిగిందంటే?
రంగారెడ్డి జిల్లా అబ్దుల్లా పూర్ మెట్ లో బండారి శ్రీను-బసవరేఖ (26) దంపతులు నివాసం ఉండేవారు. వీరికి 10 ఏళ్ల కిందటే వివాహం జరిగింది. శ్రీను మేనమామ కూతురినే వివాహం చేసుకున్నాడు. ఇక పెళ్లైన చాలా కాలం పాటు ఈ దంపతులు సంతోషంగానే కాపురాన్ని నెట్టుకొచ్చారు. వీరికి ఓ కుమారుడు, కుమార్తె సంతానం. అయితే శ్రీను పెళ్లైన కొన్నాళ్ల తర్వాత అత్తిళ్లు అయిన భూదాన్ పోచంపల్లిలో భార్యతో పాటు కాపురం పెట్టాడు. ఇక్కడే కేబుల్ ఆపరేటర్ గా పని చేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు. ఇకపోతే.. గతంలో శ్రీను భార్యను అనుమానించే వాడని తెలుస్తుంది. ఇదే విషయమై కొన్నాళ్ల పాటు భార్యాభర్తల మధ్య గొడవలు జరిగాయి. అయితే 2020 ఫిబ్రవరి 23న ఈ దంపతులు మరోసారి గొడవ పడ్డారు.
దీంతో భార్య బసవరేఖ తన పిల్లలను తీసుకుని పట్టింటికి వెళ్లింది. తట్టుకోలేని శ్రీను.. అత్తింటికి వెళ్లి తన పిల్లలను నాకివ్వాలంటూ గొడవ చేశాడు. ఈ క్రమంలోనే దంపతుల మధ్య తోపులాట జరగగా.. శ్రీను కిందపడ్డాడు. వెంటనే బసవరేఖ దిండు తీసుకుని అతని ముఖంపై పెట్టి ఊపిరాడకుండా చేసి హత్య చేసింది. అనంతరం ఈ ఘటనపై మృతుడి సోదరుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు భార్య బసవరేఖను విచారించగా.. పొంతనలేని సమాధానాలు చెప్పింది. ఇక ఎట్టకేలకు భువనగిరి ప్రధాన జిల్లా సెషన్ కోర్టు.. నిందితురాలు బసవరేఖకు జీవితఖైదుగా శిక్ష విధిస్తూ తాజాగా తీర్పును వెలువరించింది. అంతేకాకుండా రూ.10 వేల జరిమానా కూడా విధించింది. కోర్టు తీర్పుతో మృతుడి కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.