హైదరాబాద్‌లోని పబ్బుల్లో డ్రగ్స్ వాడకం జరుగుతోందని పోలీసులు చెబుతున్నారు. ముఖ్యంగా అబ్బాయిలతో పోటీగా.. అమ్మాయిలు కూడా మాదక ద్రవ్యాలు వాడుతున్నట్లు తెలుస్తోంది.
నేటి యువత మత్తులో చిత్తవుతోంది. మహిళలు కూడా మాదక ద్రవ్యాల సరఫరాలో, సేవించడంలో పురుషులకు ఏ మాత్రం తీసిపోకుండా వ్యవహరిస్తున్నారు. ఎక్కువగా హైదరాబాద్ నగరంలో సాఫ్ట్ వేర్ ఇంజనీర్లు, ఐటీ ఉద్యోగులు వీకెండ్ వస్తే చాలు పబ్బుల్లో పార్టీలు చేసుకోవటం కామన్ అయిపోయింది. డ్రగ్ పెడ్లర్స్ పబ్బుల్లో కొకైన్, హెరాయిన్, హాష్ సిగరెట్లను యువతకు అలవాటు చేస్తున్నారు. డ్రగ్స్ వాడుతూ పోలీసుల తనిఖీలలో పట్టుబడిన వారిలో మహిళలు కూడా ఉన్నారు. గతంలో మాదక ద్రవ్యాల సరఫరా చేయటంలో పురుషుల ఆధిక్యత కనిపించేది. కానీ ట్రై కమీషనరేట్ల పరిధిలో లేడీ పెడ్లర్లు కూడా పోలీసులకు దొరికిపోతున్నారు.
పోలీసులు గత ఏడాది డ్రగ్స్ చాక్లెట్ బార్స్‌ను తనిఖీలో స్వాధీనం చేసుకున్నారు. బార్స్ కొనుగోలు చేసిన 120 మందిని పోలీసులు అదుపులోకి తీసుకోగా, అందులో 50 శాతం మంది యువతులే ఉన్నారు. వీరు 18-24 వయసు ఉన్న అమ్మాయిలు కావడం విశేషం. సంవత్సర కాలంలో నగరంలో సుమారు 1200 మంది డ్రగ్స్ సేవించిన వారిని పోలీసులు గుర్తించగా.. అందులో 150 వరకు మహిళలే ఉన్నారు. సైబరాబాద్ పోలీసులు ఛేదించిన హైటెక్ వ్యభిచారం కేసులో అమ్మాయిలకు నిందితులు డ్రగ్స్ పరఫరా చేసి, ఈ రొంపిలోకి దింపుతున్నట్లు గుర్తించారు.
మెట్రో నగనరాల్లో వీకెండ్ వస్తే చాలు ఐటీ ఉద్యోగులు యువతీ యువకులు పబ్బుల్లో పార్టీలు చేయడం పరిపాటి అయ్యింది. దీనిని ఆసరాగా చేసుకొని డ్రగ్స్ పెడ్లర్లు కొకైన్, హెరాయిన్, ఎండీఎంఏ, హాష్ సిగరెట్లు సప్లై చేసి యువతకు డ్రగ్స్ అలవాటు చేస్తున్నారు. ఇటీవల అరెస్ట్ చేసిన నైజీరియన్ విక్టర్ నగరంలో వ్యక్తిగత కస్టమర్లకు డ్రగ్స్ సరఫరా చేస్తున్నాడు. డ్రగ్స్ సరఫరా కోసం పార్టీలు నిర్వహించేవాడని పోలీసులు నిర్ధారించారు. సరదాగా మొదలైన ఈ వ్యాపారం యువతను తప్పుదోవ పట్టిస్తోంది. మరి, మత్తుకు చిత్తవుతున్న మహిళ ఉదంతంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.