సీనియర్ నటుడు నరేష్ పేరు చెప్పి.. రమ్య రఘుపతి అనే మహిళ పెద్ద ఎత్తున వసూళ్లుకు పాల్పడిన సంఘటన వెలుగులోకి వచ్చింది. సదరు మహిళపై గచ్చిబౌలి పీఎస్ లో ఐదుగురు మహిళలు ఫిర్యాదు చేశారు. రమ్య హైదరాబాద్ తో పాటు అనంతపూర్, హిందూపూర్ లో కూడా పలువురి నుంచి భారీగా వసూళ్లు చేపట్టినట్లు తెలుస్తోంది.
రమ్య రఘుపతి కేవలం నరేష్ పేరుతో మాత్రమే కాక కృష్ణ, విజయ నిర్మల పేరు చెప్పి పలువురి దగ్గర భారీగా వసూళ్లకు పాల్పడినట్లు తెలుస్తోంది. నటుడు నరేష్, రమ్య అనే మహిళ ఒకే ప్రాంగణంలో నివసిస్తున్నట్లుగా సమాచారం. ఫోటోలను బట్టి చూస్తుంటే.. వసూళ్లకు పాల్పడ్డ మహిళకి.. నటుడు నరేష్ తో పరిచయం ఉన్నట్లుగా తెలుస్తోంది. అయితే వీరి మధ్య ఉన్న సంబంధం ఏంటనేది పోలీసులు వెల్లడించడం లేదు. ఇక ఈ ఘటనపై నటుడు నరేష్ స్పందించారు. రమ్య వసూళ్లతో తమకు సంబంధం లేదన్నారు.