ప్రపంచంలో అమ్మ ప్రేమకు మించినది మరొకటి లేదు. ఎందుకంటే అంతలా అమ్మ.. తన బిడ్డలను కంటికి రెప్పలా కాపాడుకుంటుంది. తన బిడ్డకు చిన్నపాటి గాయమైన తల్లి ప్రాణం విలవిల్లాడుతుంది. కానీ కొందరు తల్లులు మాత్రం పిల్లలపై దారుణాలకు తెగబడుతున్నారు. కుటుంబ కలహాల కారణంగా, మతిస్థితి లేకపోవడం, ఇతర కారణాలతో బిడ్డలను బలి తీసుకుంటున్నారు. నవమాసాలు కనీ,పెంచిన విషయం కూడా మరచి.. బిడ్డలను దారుణంగా చంపేస్తున్నారు. తాజాగా ఓ మహిళ.. అభం శుభం తెలియని తన నాలుగేళ్ల కూతుర్ని 4వ అంతస్తు నుంచి విసిరేసింది. దీంతో ఆ పసిబిడ్డ అక్కడిక్కడే మరణించింది. ఈ ఘటన కర్నాటకలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..
కర్నాటక రాష్ట్రం బెంగళూరులోని సంపంగి రామ్ నగర్ లో సుష్మా భరద్వాజ్, కిరణ్ అనే దంపతులు నివాసం ఉంటున్నారు. సుష్మ డెంటల్ కోర్స్ చేసింది. వీరికి నాలుగేళ్ల కూతురు ఉంది. ఈ పాప పుట్టుకతోనే దివ్యాంగురాలు. దీంతో పాప కారణంగా ఆమె ఇంట్లోనే గడుపుతోంది. ఈ క్రమంలో అప్పుడప్పుడు బిడ్డ తన కెరీర్ కి అడ్డుగా ఉందని భావించేది. ఈ క్రమంలో గురువారం నాల్గవ అంతస్తు బాల్కనీ నుంచి పాపను విసిరేసింది. దీంతో బిడ్డ అక్కడిక్కడే చనిపోయింది. అనంతరం తాను ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించింది. నిందితురాలు సుష్మా భరద్వాజ్ ను ఇరుగు పొరుగువారు రక్షించారు.
గతంలోనూ సుష్మ.. తన కూతురిని హాసన్ రైల్వేస్టేషన్ లో వదిలేయగా..తండ్రి కిరణ్ స్టేషన్ కు వెళ్లి పాపను తీసుకొచ్చాడు. ఆసమయంలో భార్యపై ఎలాంటి ఫిర్యాదు చేయలేదు. తాజాగా పాపను బాల్కనీ నుంచి విసిరేసింది. నిందితురాలిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. విచారణ చేస్తున్నారు. ఆమె మానసి పరిస్థితిపై వైద్యుల సంప్రదించిన అనంతరం చర్యలు ఉంటాయని తెలిపారు. మరి.. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
Shocker from #Bengaluru: Mother throws her own child to death from the 5th floor of her apartment. Incident happened at SR Nagar.After throwing her child to death-she attempted suicide herself.But was saved by the residents. #Karnataka pic.twitter.com/OyexeCyKaL
— Imran Khan (@KeypadGuerilla) August 5, 2022