భార్యా భర్తల మధ్య గొడవలకు కారణాలే అవసరం లేదు. చిన్న చిన్న విషయాలు కూడా యుద్ధాలకు దారి తీస్తాయి. మనస్పర్థలతో దంపతుల మధ్య అగ్ని రాజుకుంటుంది. అనుమానాలు, అపార్థలు, అపోహలు పెరుగుతూ ఉంటాయి. చివరికీ ప్రాణాలు తీసేంత పగలు, ప్రతీకారాలతో రగిలిపోతుంటారు. అటువంటి ఘటనే ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్ లో శనివారం రాత్రి చోటుచేసుకుంది.
జరిగిందేమిటదన్నదీ బాధితుడు డబ్బూ గుప్తా చెబుతున్నదాని ప్రకారం.. డబ్బూ గుప్తా, అతడి భార్య పూనమ్ కుటుంబం కలెక్టర్ గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కోపర్ గంజ్ ప్రాంతంలో నివాసం ఉంటుంది. శనివారం రాత్రి 12.30 గంటలకు భార్య ఇంటికి చేరుకోగా.. ఎక్కడి నుండి వస్తున్నావని అడగ్గా.. అతడిపై గొడవకు దిగింది. అనంతరం డబ్బూను అతడి భార్య కొట్టగా.. తిరిగి అతడూ భార్యపై చేయిచేసుకున్నాడు. దీంతో ఆగ్రహంతో ఊగిపోయిన ఆమె..బాత్ రూమ్ లో ఉన్న యాసిడ్ తీసుకు వచ్చి భర్త మొహంపై పోసింది. యాసిడ్ పడటంతో అతడి ముఖం కాలిపోయింది.
దీంతో అతడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రంగంలోకి దిగిన పోలీసులు పూనమ్‌ను ఆదివారం సాయంత్రం అరెస్టు చేశారు. కాగా, మద్యం మత్తులో తన భర్త తనపై దాడి చేయడంతో ఈ చర్యకు దిగినట్లు పూనమ్ తెలిపారు. అయితే ప్రాథమిక విచారణలో డబ్బూ డ్రగ్స్ కు బానిసయ్యాడని, ఈ విషయంలో వీరిద్దరీ మధ్య తరచూ గొడవ జరుగుతూనే ఉంటుందని తేలింది. అతడి చర్యతో విసుగుపోయినభార్య.. తన దారి తాను చూసుకుందని స్థానికులు చెబుతున్నారు.
पति पर तेजाब फेकने वाली महिला को थाना कलक्टरगंज पुलिस ने किया गिरफ्तार। @Uppolice pic.twitter.com/GNGBRmjHcQ
— POLICE COMMISSIONERATE KANPUR NAGAR (@kanpurnagarpol) January 29, 2023
భర్తపై యా** పోసిన మహిళ pic.twitter.com/m33CytHJ2p
— Hardin (@hardintessa143) January 30, 2023