Hyderabad: అతడో చిరుద్యోగి. ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. రోజులానే ఆ రోజు కూడా ఆఫీస్ కెళ్లాడు. సాయంత్రం డ్యూటీ అయిపోయిన తర్వాత ఇంటికొచ్చాడు. టీ కాఫీతో ఎదురొస్తుందనుకున్న భార్య కనిపించలేదు. ఆమె కోసం చాలా వెతికాడు. కానీ, లాభం లేకపోయింది. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ సంఘటన హైదరాబాద్‌లో శనివారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. హైదరాబాద్, చర్చిగాగిల్లాపూర్ చైతన్య కాలనీకి చెందిన సుధాకర్, లక్ష్మి ప్రసన్న ఆలుమగలు. సుధాకర్ ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు.
ఈ నెల 10వ తేదీన రోజులాగే ఆఫీస్‌కు వెళ్లాడు. సాయంత్రం డ్యూటీ అయిపోగానే ఇంటికి వచ్చాడు. అప్పుడు సమయం 5.30 గంటలు. భార్య కాఫీ కప్పుతో ఎదురొస్తుందని అనుకున్నాడు. కానీ, అలా జరగలేదు. లక్ష్మీ ప్రసన్న ఇంట్లో కనిపించలేదు. భార్య కోసం అంతా వెతికాడు. అయినా లాభం లేకపోయింది. చుట్టు పక్కల వారిని అడిగినా తమకు తెలీదని సమాధానం ఇచ్చారు. ఆమె ఫోన్‌కు కూడా చాలా సార్లు కాల్ చేశాడు.
స్విచ్ఛాఫ్ అని వచ్చింది. దీంతో అతడు ఆందోళనకు గురయ్యాడు. భార్యకు ఏమైందోనన్న అనుమానం కలిగింది. వెంటనే పోలీసులను ఆశ్రయించాడు. తన భార్య కనిపించటం లేదని ఫిర్యాదు చేశాడు. మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మరి, ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : 15 ఏళ్ల బాలికను ఎత్తుకెళ్లి నరకం చూపించిన దుండుగులు! అత్యాచారం, ఆపై!