మానవ సంబంధాలు మంట కలసిపోతున్నాయి ..ప్రేమాభిమానాలు దూరమై పోతున్నాయి,అగ్ని సాక్షిగా జరిగిన పెళ్లి ప్రమాణాలు మరచిపోతున్నారు.ప్రేమకి,వ్యామోహానికి తేడా తెలియటం లేదు.ఆకర్షణలకు కొందరు ,అజ్ఞానంతో కొందరు జీవితాలను నాశనం చేసుకుంటున్నారు.కుటుంబం చిన్నాభిన్నమై అన్నెం పున్నెం ఎరుగని పిల్లలు అనాధలవుతున్నారు .
మోహంతో ఎంతటి కైనా తెగిస్తూ చివరకు కడతేర్చటానికి కూడా వెనుకాడటం లేదు.ఈ సంఘటన చూస్తే అర్ధమవుతుంది..దాదాపుగా ఎక్కడో అక్కడ ఇలాంటి సంఘటనలు జరగటం సర్వ సాధారణమై పోయింది.చట్టాలు న్యాయాలు ఎంత ప్రయత్నించినా మనుష్యుల పోకడలు మారటం లేదు..ఇంక వివరాలలోకి వెళదాం.
అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడని కట్టుకున్న భర్తను ప్రియుడి చేత చంపించింది ఓ ఇల్లాలు .ఎంతో తెలివిగా పధకం వేసి దుశ్చర్యకు పాల్పడినా పోలీసులు సామాన్యులా ..వారి పద్ధతిలో కూపీ లాగారు అసలు విషయాలు తెలిసాయి .విశాఖ పట్నం మధురవాడ లోని దుర్గానగర్ లో రాత్రి వాకింగ్ కి వెళ్లి వస్తున్న సతీష్ ని ఓ వ్యక్తి ఇనుప రాడ్ తో తలపై కొట్టి హత్య చేసాడు.అదే సమయంలో చనిపోయిన వ్యక్తితో పాటు అతని భార్య రమ్య .
ఆమె పిల్లలు కూడా ఘటనా స్థలానికి ఆరు అడుగుల దూరంలో ముందే నడుస్తున్నారు.రక్తపు మడుగులో పడి ఉన్న భర్తను స్థానిక ఆసుపత్రికి తరలించినా ఫలితం లేకుండా పోయింది.అప్పటికే అతని ప్రాణాలు గాలిలో కలసిపోయాయి.వైద్యులు నిర్ధారించిన తరువాత భార్య పోలీసులకు సమాచారం అందించింది.పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి డాగ్ స్క్వాడ్ ,క్లూస్ టీమ్ తో ఆధారాలు సేకరించారు.
సతీష్ భార్య రమ్య ఫిర్యాదులో తన భర్తపై దాడికి పాల్పడుతున్న సమయంలో తానూ ఆరు అడుగుల దూరంలో ఉన్నానని చెప్పటం ,ఆసమయంలో ఆమె అడ్డుకోకపోవటం పట్ల అనుమానం వచ్చి పోలిసులు ఆమెను అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా నిజం బయటపెట్టింది.మొదట తన భర్తకు ఆర్ధిక లావాదేవీలకు సంబంధించి వేరే వ్యక్తితో గొడవలు ఉన్నాయని పోలీసులను పక్కదారి పట్టించింది .
హత్యకు రెండు రోజుల ముందే ప్రియుడు షేక్ భాషాతో కలసి రమ్య రెక్కీ నిర్వహించింది,సీసీ కెమెరాలు లేని,నిర్మానుష్యంగా ఉండే ప్రదేశాన్ని ఎంచుకుని నిందితులు హత్యకు పాల్పడినట్టు డీ సీపీ గౌతమ్ శాలి మీడియా సమావేశంలో వెల్లడించారు. నిందితులిద్దరూ స్కూల్ నాటి నుంచి స్నేహితులుగా ఉంటూ ప్రేమ వ్యవహారం నడిపించారని తెలిపారు.
చాలా ఏళ్ల తరువాత పదోతరగతి స్నేహితుల వాట్స్ అప్ గ్రూప్ ద్వారా తిరిగి వీరు ఒక్కటయ్యారని డీ సీపీ తెలిపారు .తమ బంధానికి ఆటంకంగా ఉన్న సతీష్ ను అడ్డు తొలగించుకుని వారిద్దరూ ఒక్కటవ్వాలని రమ్య ,బాషా పధకం ప్రకారం ఈ హత్యకు పాల్పడినట్లు డీ సీపీ వివరించారు.నిందితులిద్దరినీ అరెస్ట్ చేసి రిమాండ్ కి తరలించారని తెలిపారు .