ఈ మధ్యకాలంలో కొందరి మగాళ్లు వయసు పెరిగిన బుద్దిమాత్రం మాత్రం మార్చుకోవడం లేదు. అందంగా ఆడది కనిపిస్తే చాలు వయసు కుర్రాడిలా మారి బరితెగించి ప్రవర్తిస్తున్నారు. తాజాగా ఇలాంటి ఘటనలో ఓ 42 ఏళ్ల మహిళ ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. ఇక విషయం ఏంటంటే..? ప్రకాశం జిల్లాలోని కామేపల్లి గ్రామానికి చెందిన వంకాయలపాటి విజయలక్ష్మికి 42 ఏళ్లు. వ్యవసాయ కూలీల కోసమని ఆ గ్రామంలో తిరుగుతు ఉంది. అంతలోనే అదే గ్రామానికి చెందిన వల్లెపు ఓబయ్య అనే ఓ 60 ఏళ్ల వ్యక్తి ఆ మహిళతో మాటా మాటా కలిపాడు.
దీంతో కామంతో ఊగిపోతున్న ఆ దుర్మార్గుడు ఆ మహిళ కాళ్లనొప్పులతో బాధపడుతున్న విషయాన్ని పసిగట్టాడు. దీంతో వెంటనే నా వద్ద మందులు ఉన్నాయని, వేసుకుంటే నొప్పులు తగ్గుతాయని చెప్పాడు. ఇదే నిజమేనని నమ్మిన ఆ వివాహిత అతని వెంటనే ఇంట్లోకి వెళ్లింది. వెంటనే తలుపులు మూసిన ఆ పెద్దాయన ఆ వివాహితపై అత్యాచారానికి ఒడిగట్టాడు. దీంతో ప్రటిఘటించిన మహిళ అరుపులు కేకలతో అల్లరి చేసింది.
దీంతో ఏం చేయాలో తెలియని ఓబయ్య కాళ్లను, చేతులను కట్టేసి గొడ్డలితో అతి కిరాతకంగా నరికాడు. ఇక ఇదే విషయాన్ని ఆ మహిళ కుటుంబ సభ్యులకు చెప్పాడు. ఇక ఈ విషయం తెలుసుకున్న పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. దీంతో ఆగ్రహంతో ఊగిపోయిన గ్రామస్తులు పోలీసుల వద్ద నున్న దుర్మార్గుడు ఓబయ్యను లాగి తీవ్రంగా చితకబాదారు. గ్రామస్తులు విచక్షణ రహితంగా కొట్టడంతో ఓబయ్య అక్కడికక్కడే మరణించాడు. తాజాగా జరిగిన ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది.