ఈ మద్య తెలుగు రాష్ట్రాల్లో పలు చోట్ల వీధి కుక్కల దాడుల్లో తీవ్రంగా గాయాలపాలు కావడమే కాదు.. ప్రాణాలు సైతం పోతున్నాయి. హైదరాబాద్ అంబపర్ పేట్ లో నాలుగేళ్ల ప్రదీప్ పై వీధి కుక్కలు దాడి చేసే విచక్షణ రహితంగా చంపేయడం అందరిని ఎంతగానో కలిసివేసింది. ఈ సంఘటన తెలుగు రాష్ట్రాల్లో ఒక్కసారే కలకలం రేగింది.
ఈ మద్య కాలంలో తెలుగు రాష్ట్రాల్లో వీధి కుక్కల బెడద నానాటికీ పెరిగిపోతుంది. ఇటీవల హైదరాబాద్ అంబర్ పేట్ లో చిన్నారి ప్రదీప్ ని వీధి కుక్కలు అతి కిరాతకంగా కొరికి చంపిన ఘటన మరువక ముందే ఇలాంటి సంఘటనలు వరుసగా జరుగుతూనే ఉన్నాయి. ప్రభుత్వం అప్పటికప్పుడు కంటి తూడుపు చర్యలు తీసుకుంటున్నా.. విధి కుక్కల బెడద మాత్రం తొలగించలేకపోతుంది. తాజాగా ఓ యువతిని చుట్టూ జనాలు ఉన్నా భయం లేకుండా వచ్చి కరిచింది వీధి కుక్క. ఈ ఘటన హైదరాబాద్ నానాక్ రాంగూడలో జరిగింది. వివరాల్లోకి వెళితే..
తెలంగాణలో కుక్కల దాడులు రోజు రోజుకీ పెరిగిపోతూనే ఉన్నాయి. ప్రభుత్వం ఎన్ని కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నా.. కొన్ని చోట్ల వీధి కుక్కలు మనుషులపై విచక్షణారహితంగా దాడులు చేస్తున్నాయి. ఈ దాడుల్లో గాయపడటమే కాదు.. ప్రాణాలు పోయిన వారు కూడా ఉన్నారు. తాజాగా నానాక్ రాంగూడ లాంకో హిల్స్ వద్ద ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న స్నేహితురాలిని మందలించేందుకు వెళ్తున్న యువతిపై వీధి కుక్క దాడి చేసింది. చుట్టూ జనాలు ఉన్నా ఏమాత్రం భయం లేకుండా ఆ కుక్క యువతి కాలిని కొరికి వేసింది.. ఇది గమనించిన స్థానికులు కుక్కను తరిమివేశారు.
అప్పటి వరకు తన స్నేహితురాళ్లతో మాట్లాడుతున్న మహిళపై మాటు వేసిన వీధి కుక్క అకస్మాత్తుగా దాడి చేసింది. అప్పటికీ కేకలు వేయడంతో స్థానికులు అలర్ట్ అయి కుక్కను అక్కడ నుంచి తమిరివేశారు.. కానీ అప్పటికే ఆ కుక్క యువతి కాలు కొరికివేసి అక్కడ నుంచి వెళ్లి పోయింది. ఆ యువతిని స్నేహితురాళ్లు వెంటనే దగ్గరలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. ఏది ఏమైనా చిన్న పిల్లలే కాదు.. పెద్ద వాళ్లు కూడా వీధుల్లో ప్రశాంతంగా తిరగాలంటే తిరగలేని పరిస్థితి నెలకొంది. ఎక్కడ నుంచి కుక్కులు దాడులు చేస్తాయో అన్న భయం పట్టుకుంది. ప్రభుత్వాలు మాత్రం ఏదైనా సంఘటన జరిగితే అప్పటికప్పుడు హడావుడి చేసి తర్వాత మిన్నకుంటున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన దృశ్యాలు సీసీ టీవీలో రికార్డు అయ్యాయి.