సమాజంలో పరిస్థితులు ఎలా మారిపోతున్నాయో ఎవరికి కూడా అర్ధం కాని పరిస్థితి. తాజాగా ఓ గర్భిణి మహిళ టీనేజ్ వయసు గల తమ్ముడితో కలిసి చేయాల్సిందంతా చేసి తప్పుని ఒప్పుకుని కోర్టు ముందు కన్నీరు కార్చేంత పని చేసింది. ఇంతకి ఆ మహిళ చేసిందేంటి? అసలు కోర్టు మెట్లు ఎక్కాల్సిన పరిస్థితులు ఏంటనేవి ఇప్పుడు తెలుసుకుందాం.
ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే.. పంజాబ్ లోని రజనీ శర్మ అనే 24ఏళ్ల మహిళకు ఓ యువకుడితో గతంలో పెళ్లైంది. వీరికి ఓ బిడ్డ జన్మించగా ప్రస్తుతం ఆ మహిళ గర్భవతిగా ఉంది. ఇక భర్తతో పాటు ఆ మహిళ ఫతేగఢ్ సాహిబ్ లో నివాసం ఉంటున్నారు. అయితే వీరితో పాటే ఉంటున్నాడు ఆ వివాహిత తమ్ముడు. భర్త పని చేయగా వచ్చిన డబ్బులు ఇంట్లో ఖర్చులకు పోను మిగలడం లేదని స్థానికంగా ఉండే లూథియానా సిటీలోని రజినీ శర్మ తన టీనేజ్ తమ్ముడితో పాటు ఓ బంగారం షాప్ లో దొంగతనానికి పాల్పడింది. దీంతో ఆ దృశ్యాలు సీసీ ఫుటేజ్ లో రికార్డ్ కాగా ఆ షాప్ ఓనర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
ఇక కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టి అక్కా తమ్ముడిని కోర్టులో హాజరపరిచారు. ఇక న్యాయమూర్తి ప్రశ్నలకు ఆ మహిళ దిమ్మతిరిగే సమాధానాలు చెప్పింది. నా భర్త తెచ్చే డబ్బులు ఇంట్లో సరిపోవటం లేదని, తప్పని పరిస్థితుల్లోనే ఈ దొంగతనం చేయాల్సి వచ్చిందని తన నేరాన్ని ఒప్పుకుంది. ఇక వీరి వాదనలు విన్న న్యాయస్థానం వీరిని రిమాండ్ కు తరలించారు. తాజాగా జరిగిన ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.