నేటి కాలంలో ఆర్థిక లావాదేవిల విషయంలోనే దారుణమైన ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. భూ వివాదాల్లో అన్నదమ్ముల మధ్య వైరం పెరిగి హత్యలు జరినవి చాలా విని ఉంటాం. కానీ దీనికి విరుద్దంగా అదే ఆర్థిక అంశాల్లో ఏకంగా కట్టుకున్న భర్తను హత్య చేసిన భార్య ఘటన మాత్రం మహబూబ్ నగర్ జిల్లాలో చోటు చేసుకుంది. వినటానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం.
ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే.. అది మహబూబ్నగర్ జిల్లా నవాబుపేట మండలం మొరంబావి గ్రామం. చెన్నయ్య, రాములమ్మకు గత కొనేళ్ల కిందట వివాహం జరిగింది. ఇక వీరికి రెండెకరాల పొలం ఉంది. ఈ మధ్య కాలంలోనే ఒక ఎకర భూమిని అమ్మేసే కొత్త ఇల్లును నిర్మించ తలపెట్టారు. ఇక కొన్ని రోజులకు భార్యభర్తల మధ్య తీవ్ర వివాదం జరిగింది. దీంతో భర్తను అంతమొందించాలన్న ఆలోచనలోకి వెళ్లింది భార్య రాములమ్మ. ఇక పథకం ప్రకారమే తన బంధువులతో కలిసి ఏకంగా హత్యచేసి కొత్తగా నిర్మిస్తున్న బాత్ రూంలో పాతిపెట్టిందీ కసాయి భార్య. దీంతో ఏం తెలియనట్టు కొత్తనాటకానికి తెర తీసింది.
వెంటనే పోలీసులకు తన భర్త కనిపించటం లేదంటూ ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదు అందుకున్న పోలీసులు చుట్టు పక్కల ప్రాంతాల్లో గాలింపు చర్యలు చేపట్టారు. దీంతో అలా రెండు నెలలు గడిచింది. భర్త చెన్నయ్య ఆచూకి మాత్రం పోలీసులకు అంతుచిక్క లేదు. కానీ చెన్నయ్య అక్కా, చెల్లెల్లకు మాత్రం భార్య రాములమ్మ మీద కాస్త అనుమానం ఏర్పడింది. వెంటనే రూట్ మార్చిన పోలీసులు రాములమ్మను గట్టిగా నిలిదీశారు. తనకు తెలియదంటూ రాములమ్మ తప్పించుకునే ప్రయత్నం చేసింది.
ఇక పోలీసుల అసలు రూపాన్ని బయటకు తీసేసరికి పెదవి విప్పిన రాములమ్మ నా భర్తను నేనే హత్యచేసి కొత్తగా నిర్మిస్తున్న బాత్ రూంలో పాతిపెట్టినట్లు తెలిపింది. ఒక్కసారిగా పోలీసులు, కుటుంబ సభ్యులు షాక్ కు గురయ్యారు. ఇక రెవెన్యూ అధికారుల సాయంతో పోలీసులు పాతిపెట్టిన భర్తను శవాన్ని బయటకు తీశారు. ఇక వెంటనే పోస్ట్ మార్టం నిమిత్తం శవాన్ని ఆస్పత్రికి తరలించారు. మిగిలిన ఎకరా భూమి కూడా అమ్మాలన్నాడని, అందుకే హత్యచేశానని రాములమ్మ తెలిపింది. ఇక ఇటీవల జరగిన ఈ స్థానికంగా సంచలనంగా మారింది. భర్తను చంపిన రాములమ్మకు ఎలాంటి శిక్ష విధించాలో కామెంట్ల రూపంలో తెలియజేయండి.