భార్యాభర్తలు అన్నాక గొడవలు జరగడం సహజం. అయితే ఇలాగే ఓ భార్యాభర్తల మధ్య చిన్న గొడవ జరిగింది. కోపంతో ఊగిపోయిన భర్త భార్యను అక్కడ కొరికాడు. దీంతో రచ్చ రచ్చ చేసిన భార్య చివరికి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇటీవల ఏపీలో చోటు చేసుకున్న ఈ ఘటనను చూసి కొంత మంది నవ్వుకుంటుంటే.., మరికొందరు మహిళలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
అసలేం జరిగిందంటే? అది ఏపీలోని కృష్ణా జిల్లా పెనమలూరు మండలం కానూరు. ఇదే ప్రాంతంలోని కేసీపీ కాలనీకి చెందిన తాళ్లపూడి రాంబాబు, స్రవంతి భార్యాభర్తలు. వీరికి పెళ్లై చాలా కాలమే అవుతుంది. అయితే భర్త స్థానికంగా సెక్యూరిటీ గార్డుగా పని చేస్తూ కుటుంబాన్ని నెట్టుకొస్తున్నాడు. కాగా భార్య మాత్రం ఇంట్లోనే ఉండేది. ఈ మధ్య కాలంలో భర్త రాంబాబు తాగుడుకు బానిసయ్యాడు. రోజూ తాగిరావడంతో పాటు భార్యతో గొడవకు కూడా దిగుతుండే వాడు. తాజాగా భర్త యాథావిధిగా తాగొచ్చి భార్యతో గొడవకు దిగాడు.
ఇక కోపంతో ఊగిపోయిన భార్య భర్తను రెండు మాటలు అనేసింది. ఇక కోపంతో ఊగిపోయిన భర్త భార్య బుగ్గపై ఇష్టంతో కాకుండా కోపంతో కొరికాడు. లబోదిబో మన్న భార్య అటు ఇటు గంతులేసింది. భర్త ఇలా కొరకడాన్ని తప్పుపట్టిన భార్య వెంటనే పోలీస్ స్టేషన్ గుమ్మకం తొక్కింది. అనంతరం పోలీసులకు.. నా భర్త రోజూ తాగొచ్చి కొడుతున్నాడని, తాజాగా నా బుగ్గపై కొరికాడని తెలిపి నాకు న్యాయం చేయాలని వేడుకుని అనంతరం ఆస్పత్రికి వెళ్లింది. బాధిత మహిళ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపడుతున్నారు. భర్త బుగ్గకొరికాడని కేసు పెట్టిన భార్య తీరుపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.