హైదరాబాద్ నారాయణగూడలోని దత్తానగర్‌కు చెందిన రాంబాబు, స్వప్నకు 20ఏళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అన్యోన్యంగా సాగుతున్న వీరి జీవితంలో ఊహించని ఘటన భార్య మరణానికి దారి తీసింది. ఇక విషయం ఏంటంటే..? రాంబాబు క్యాబ్ డ్రైవర్‌గా పనిచేస్తుండగా స్వప్న ఓ స్థానిక బేకరీలో స్వీపర్‌గా పనిచేస్తోంది. నిత్యం ఇంట్లో బ్రౌన్ రైస్‌తో భోజనం చేస్తు ఉంటారు.
ఎప్పుడైనా తెల్లన్నం తినాలని ఉందంటే భార్య కోరిక మేరకు భర్త తెల్లబియ్యం తీసుకొస్తూ ఉండేవాడు. అలా కొన్ని రోజుల తర్వాత భర్త తెల్ల బియ్యం తేవటం పూర్తిగా మానేశాడు. ఇక బ్రౌన్ రైస్ తినలేక భార్య భర్తకు పలుమార్లు విన్నవించింది. ఇక ఆ రైస్ తినలేనని తెల్ల బియ్యం తేవాలని చెప్పి పంపింది. దీంతో ఆమె చెప్పినట్లు భర్త తెల్ల బియ్యం తీసుకురాపోగా స్వప్న తీవ్ర మనస్తాపానికి గురైంది. నేను చెప్పినట్లు తెల్ల బియ్యం తీసుకురాలేదని భర్తపై కోపంతో ఊహించని నిర్ణయం తీసుకుని ఆత్మహత్య చేసుకుంది.
ఇక అదే రోజు ఇంట్లో ఉన్న ఫ్యాన్ కు ఉరేసుకుని స్వప్న ఆత్మహత్యకు పాల్పడింది. ఇక విషయం తెలుసుకున్న పోలీసులు రంగంలోకి దిగారు. కేసు నమోదు చేసుకుని విచారణ చేపడుతున్నారు. పెళ్లై ఇన్ని సంవత్సరాలు గడుస్తున్నా ఏనాడు కూడా గొడవ పడని సందర్భాలున్నాయని స్థానికులు తెలియజేస్తున్నారు. ఇక స్వప్న తీసుకున్న నిర్ణయంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.