విశాఖ శ్వేత కేసు ఇప్పుడు సంచలనంగా మారుతోంది. అనుమానాస్పద స్థితిలో ఆమె శవమై కనిపించడంతో ఎన్నో అనుమానాలకు తావిస్తోంది. అయితే తాజాగా శ్వేత మృతదేహానికి పోస్ట్ మార్టం రిపోర్ట్ పూర్తింది. ఈ రిపోర్ట్ ప్రస్తుతం పోలీసుల చేతిలోఉంది. ఆ రిపోర్ట్ లో ఏముందనేది ఇప్పుడు సర్వాత్ర ఉత్కంఠగా మారింది.
విశాఖలోని గాజువాకకు చెందిన శ్వేత బీచ్ ఒడ్డున అనుమానాస్పద స్థితిలో శవమై కనిపించిన విషయం తెలిసిందే. ఈ ఘటన ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారింది. అయితే ఈ ఘటనపై మృతురాలి తల్లి స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ క్రమంలోనే మృతురాలి తల్లి సంచలన ఆరోపణలు చేసింది. నా కూతురుపై ఆడపడుచు భర్త చెయ్యేశాడంటూ అందరికీ షాకిచ్చింది. ఇక బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు శ్వేత మామ, ఆడ పడుచులపై వరకట్నం వేధింపుల కింద కేసుతో పాటు మృతురాలి ఆడ పడుచు భర్తపై లైంగిక వేధింపుల కేసు కూడా నమోదు చేశారు.
ఇదిలా ఉంటే.. అసలు శ్వేత ఆత్మహత్య చేసుకుందా? లేక ఎవరైనా హత్య చేశారా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే తాజాగా శ్వేత మృతదేహానికి పోస్ట్ మార్టం పూర్తైంది. ప్రస్తుతం ఆ రిపోర్ట్ నివేదిక పోలీసుల చేతి చెంతకు చేరినట్లుగా తెలుస్తుంది. కాగా అందులో ఏముందనేది మాత్రం ఇప్పుడు సర్వాత్ర ఉత్కంఠగా మారింది. ఆ రిపోర్టు నివేదిక ఆధారంగానే పోలీసులు తదుపరి విచారణ జరపనున్నారని స్పష్టంగా తెలుస్తుంది. ఇక మొత్తానికి శ్వేత పోస్ట్ మార్టం రిపోర్టులో ఏముందనేది త్వరలో పోలీసులు మీడియా ముందు వివరించనున్నారు. ఆమె ఆత్మహత్య చేసుకుందా? లేక ఎవరైనా హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారా అనే నిజాలు బయటపడనున్నాయి.
అసలేం జరిగిందంటే?
విశాఖలోని గాజువాకలో శ్వేత-మణికంఠ దంపతులు నివాసం ఉండేవారు. వీరికి గతేడాది వివాహం జరిగింది. భర్త సాఫ్ట్ వేర్ ఉద్యోగి. పెళ్లైన కొంత కాలం పాటు ఈ భార్యాభర్తలు సంతోషంగానే ఉన్నారు. అయితే రాను రాను మణికంఠ భార్యను ప్రేమగా చూసుకోకపోవడం, ఆమెను దూరం పెట్టడం వంటివి చేశాడని తెలుస్తుంది. ఇదే విషయంపై ఈ దంపతులు తరుచు గొడవ పడేవారట. ఈ క్రమంలోనే భర్త మణికంఠ ఉద్యోగ నిమిత్తం ఇటీవల హైదరాబాద్ వెళ్లాడు. వెళ్లిన తర్వాత కూడా భార్యాభర్తలు ఫోన్ లో మళ్లీ గొడవ పడ్డారని సమాచారం. ఈ నేపథ్యంలోనే 5 నెలల గర్భిణీ అయిన శ్వేత మంగళవారం ఇంట్లో సూసైడ్ నోట్ రాసి పెట్టి అప్పటి నుంచి కనిపించకుండాపోయింది. వెంటనే ఆమె అత్తమామలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులకు గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలోనే శ్వేత విశాఖ బీచ్ లో నగ్నంగా శవమై కనిపించింది.