ఇతని పేరు హరీష్ బాబు. వయసు 33 ఏళ్లు. ఉన్నత చదువులు పూర్తి చేసిన ఈ యువకుడు ఢిల్లీలోని ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో ఉద్యోగం చేస్తున్నాడు. కోరుకున్న ఉద్యోగం, మంచి జీతం ఉండడంతో తల్లిదండ్రులు పెళ్లి చేసుకోవాలని కోరారు. ఇటీవల హరీష్ బాబు తల్లిదండ్రులు ఓ అమ్మాయితో నిశ్చితార్థం కూడా జరిపించారు. ఇక 10 రోజుల్లో పెళ్లి. ఇరు కుటుంబాలు పెళ్లి ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. అయితే ఈక్రమంలోనే హరీష్ బాబు ఉన్నట్టుండి ఊహించని నిర్ణయం తీసుకున్నాడు. తాజాగా వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదంగా మారింది. ఈ ఘటనలో అసలేం జరిగిందంటే?
పశ్చిమ గోదావరి జిల్లాలోని పంగిడిగూడెం ప్రాంతం. ఇక్కడే హరీష్ బాబు (33) అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. ఇతడు ఢిల్లీలోని ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో ఉద్యోగం చేస్తున్నాడు. ఇకపోతే హరీష్ బాబు సంక్రాంతి సెలవుల్లో ఇంటికి వచ్చాడు. ఈ క్రమంలోనే తల్లిదండ్రులు బంధువుల్లో ఓ అమ్మాయితో హరీష్ బాబుకు పెళ్లి నిశ్చయించారు. ఈ నెల 16న వివాహం జరగాల్సి ఉంది. అయితే ఇరువురు కుటుంబాలు పెళ్లి పనుల్లో బిజీగా మారిపోయారు. ఇదిలా ఉంటే శుక్రవారం పెళ్లి బట్టల కోసం ఏలూరు వెళ్లాలని హరీష్ బాబు తల్లిదండ్రులకు చెప్పాడు. దీంతో అతడి తల్లిదండ్రులు వెళ్లేందుకు పయనమయ్యారు. ఇదే సమయంలో ఏం జరిగిందో ఏమో తెలియదు కానీ, హరీష్ బాబు ఇంట్లో ఫ్యానుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
ఇక హరీష్ బాబు ఉన్నట్టుండి కనిపించకపోవడంతో తల్లిదండ్రులు అంతటా వెతికారు. చివరికి ఇంట్లోకి వెళ్లి చూడగా… కొడుకు ఫ్యానుకు వేలాడుతూ కనిపించాడు. ఈ సీన్ చూసిన హరీష్ బాబు తల్లిదండ్రులు గుండెలు పగిలేలా ఏడ్చారు. అనంతరం ఈ ఘటనపై స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించారు. ఆ తర్వాత ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆత్మహత్యకు గల కారణాలు ఏమై ఉండొచ్చ కోణంలో విచారణ చేపడుతున్నారు. ఇదే ఘటన స్థానికంగా తీవ్ర విషాదంగా మారింది. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.