బంగాల్లో ఓ విషాద ఘటన చోటు చేసుకుంది. ఓ రోగి విచిత్రంగా ప్రవర్తించి నానా హంగామా సృష్టించి చివరకు మృతి చెందాడు. ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూరోసైన్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నఓ రోగి శనివారం భవనంలోని ఎనిమిదవ అంతస్తు అంచున కూర్చుని హల్ చల్ చేశాడు. వైద్యులు, సిబ్బంది ఎంతగా బ్రతిమలాడినా అతడు దిగనని మొండికి వేశాడు. దీంతో ఒక్కసారిగా అతడు కిందపడి మరణించాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
బంగాల్లోని కోల్కతా ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూరోసైన్స్ ఆసుపత్రిలో ఒక రోగి కొంత కాలంగా చికిత్స పొందుతున్నాడు. శనివారం ఉదయం 11 గంటల ప్రాంతంలో ఆ రోగి ఏనిమిదవ అంతస్తు పిట్టగోడ అంచున కూర్చొని రెండు గంటలకుపైగా హడావుడి చేశాడు. ఆ సమయంలో ఆసుపత్రి సిబ్బంది, కుటుంబ సభ్యులు కిందకు దిగమని ఎంతగా బ్రతిమలాడినా.. నిరాకరించాడు. ఆ రోగి మానసిక పరిస్థితి బాగాలేదని.. అతడు ఖచ్చితంగా కింద పడతాడని ముందే ఊహించిన అధికారులు.. వైద్య సిబ్బంది ముందుగానే ఒక నెట్ ఏర్పాటు చేశారు. కానీ ఆ రోగి మాత్రం దురదృష్టం కొద్ది నేలపై పడి తీవ్రంగా గాయాలపాలై మృతి చెందాడు.
ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న సమయంలో అతని ప్రవర్తన చాలా విచిత్రంగా ఉందని.. వెంటనే ఆస్పత్రి సిబ్బంది అధికారులకు సమాచారం ఇచ్చారు. అప్పటికే ఆ రోగి ఏనిమిదవ అంతస్తు పిట్టగోడ అంచున కూర్చొని హల్ చల్ చేశాడని ఆస్పత్రి సిబ్బంది తెలిపారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని నిచ్చెన వేసి అతన్ని చేరుకునే ప్రయత్నం చేశారు. కానీ అతడు వారు చెప్పింది వినడానికి నిరాకరించాడు.
పిట్టగోడపైనే ఉంటానని మారాం చేశాడు. తన దగ్గరికి వస్తే దూకేస్తా అంటూ బెదిరించాడు. ఈ గొడవ జరుగుతున్నంత సేపు ట్రాఫిక్ జామ్ అయ్యింది. మొత్తానికి ఆ రోగిని బతికించేందుకు అధికారులు చేసిన ప్రయత్నం ఫలించక చనిపోయాడు. ఈ విషయం పై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.