ఇతనికి నాలుగు ఏళ్ల కిందట ఓ యువతితో వివాహం జరిగింది. పెళ్లైన నాటి నుంచి దంపతులు సంతోషంగానే ఉన్నారు. ఇదిలా ఉంటే, పెళ్లై ఇన్ని రోజులు గడుస్తున్నా.. పిల్లలు కలగలేదని ఈ యువకుడు షాకింగ్ డెసిషన్ తీసుకున్నాడు. అసలేం జరిగిందంటే?
ఈ ఫొటోలో కనిపిస్తున్న యువకుడి పేరు చంద్రశేఖర్. వయసు 28 ఏళ్లు. నాలుగు ఏళ్ల కిందట ఓ యువతిని పెళ్లి చేసుకున్నాడు. పెళ్లైన నాటి నుంచి ఈ దంపతుల దాంపత్య జీవితం సాఫీగానే సాగుతూ వచ్చింది. ఇక భార్యాభర్తలు కొన్ని రోజుల పాటు ఎలాంటి గొడవలు లేకుండా సంతోషంగా జీవించారు. అయితే, పెళ్లై ఇన్నేళ్లు గడస్తున్నా పిల్లలు కలగకపోవడంతో దంపతులు తరుచు బాధపడేవారు. ఎన్నో దేవుళ్లను మొక్కినా ఫలితం లేకుండా పోయిందని అనుకున్నారు. కాగా, పిల్లలు కలగలేదని ఇటీవల ఈ వ్యక్తి షాకింగ్ డెసిషన్ తీసుకున్నాడు. అసలేం జరిగిందంటే?
పోలీసుల కథనం ప్రకారం.. వరంగల్ జిల్లా ఏటూరు నాగారం పరిధిలోని ఎలిశెట్టిపల్లి గ్రామం. ఇక్కడే చంద్రశేఖర్- మౌనిక దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి నాలుగు ఏళ్ల కిందటే వివాహం జరిగింది. పెళ్లైన నాటి నుంచి ఈ దంపతులు ఎంతో అన్యోన్యంగా బతుకుతున్నారు. వివాహం జరిగి నాలుగు ఏళ్లు గడిచింది. కానీ, ఇంతవరకు ఈ దంపతులకు పిల్లలు కలగలేదు. దీంతో ఈ భార్యాభర్తలు ఎందరో దేవుళ్ల వద్దకు తిరిగారు. అయినా ఫలితం లేకుండాపోయింది. ఇదే విషయమై దంపతులు ఈ నెల 28న గొడవ కూడా పడ్డట్లు తెలుస్తుంది. దీంతో మౌనిక పుట్టింటికి వెళ్లిపోయింది.
పిల్లలు కలగకపోవడం, భార్య పుట్టింటికి వెళ్లడంతో చంద్రశేఖర్ తట్టుకోలేకపోయాడు. అదే రోజు ఇంట్లో పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. అతడి కుటుంబ సభ్యులు వెంటనే స్పందించి స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఇక చికిత్స పొందుతూ చంద్రశేఖర్ సోమవారం ప్రాణాలు విడిచాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పిల్లలు కలగలేదని భార్యతో గొడవపడి ఆత్మహత్య చేసుకున్న చంద్రశేఖర్ డెసిషన్ పై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.