తన తోటి స్నేహితులతో కలిసి ఆ చిన్నారి బడికి వెళ్లింది. రోజంతా స్నేహితులతో కలిసి చదువుకుంది. ఆట, పాటలతో ఆ చిన్నారి ఆనందానికి అవదుల్లేవు. అయితే ఉన్నట్టుండి ఆ బాలిక స్కూల్ ఆవరణలో ఆడుకునే క్రమంలో కరెంట్ షాక్ కు గురై మరణించింది. తాజాగా వరంగల్ జిల్లాలో వెలుగు చూసిన ఈ ఘటన స్థానికుల కంట కన్నీరు తెప్పిస్తుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. అది వరంగల్ జిల్లా సంగెం మండలం తిమ్మాపురం. లింగాల అనూషకు ఇద్దరు కుమార్తెలు. భర్తతో గొడవల కారణంగా మనస్పర్ధలు రావడంతో కొన్నాళ్ల నుంచి అనూష పుట్టింట్లో తన ఇద్దరు కూతుళ్లతో పాటు ఉంటుంది.
అయితే పెద్ద కుమార్తె రాజేశ్వరి (11) స్థానికంగా ఆరో తరగతి చదువుతోంది. కాగా ఇటీవల పాఠశాలలు పున:ప్రారంభం కావడంతో రోజులాగే రాజేశ్వరి గురువారం పాఠశాలకు వెళ్లింది. తన స్నేహితులతో స్కూల్ లో కలిసి చదువుకుంది. ఇక ఆ రోజు స్కూల్ ముగిసే సమయంలో ఉపాధ్యాయులు ఆడుకోమని పిల్లలకు చెప్పారు. దీంతో రాజేశ్వరి తన స్నేహితులతో పాటు కలిసి దాగుడు మూతలు ఆట ఆడుతున్నారు. ఆటలో భాగంగా రాజేశ్వరి తోటి స్నేహితులకు దొరకుండా స్కూల్ భవనం వెనకకు వెళ్లింది. అక్కడ కరెంట్ తీగలు తేలి ఉన్నాయని గుర్తించలేక రాజేశ్వరి ఆటలో నిమగ్నమైంది.
ఇది కూడా చదవండి: Lucky Saxena : ప్రముఖ యాంకర్, కవయిత్రి లక్కీ సక్సేనా ఆత్మహత్య!
దీంతో కరెంట్ షాకు గురైన ఆ చిన్నారి అక్కడికక్కడే కిందపడిపోయింది. రాజేశ్వరి అరుపులు విన్నా స్కూల్ సిబ్బంది హుటాహుటిన భవనం వెనక్కి వెళ్లి చూశారు. వెంటనే ఆ బాలికను వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఇక చికిత్స పొందుతూ చిన్నారి రాజేశ్వరి ప్రాణాలు విడిచింది. ఈ విషయం తెలుసుకున్న ఆ బాలిక తల్లి అనూష కన్నీరు మున్నీరుగా విలపించింది. రాజేశ్వరి మరణంతో ఆ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. నేటి వరకు ఆడుతు, పాడుతు మా ముందు తిరిగిన చిన్నారి మళ్లీ తిరిగి రాదని తెలియడంతో గ్రామస్థులు కంటతడి పెట్టారు. తాజాగా వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదంగా మారింది. ఈ ఘటనలో రాజేశ్వరి మరణంపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.