ఈమె పేరు ప్రీతి. వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజీలో పీజీ అనస్థీషియా చదువుతుంది. చదువుల్లో చురుగ్గా ఉండే ప్రీతి.. ఇటీవల హానికరమైన ఇంజక్షన్ తీసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. అసలేం జరిగిందంటే?
ఓ పీజీ విద్యార్థిని ఆత్మహత్యాయత్నం చేసుకున్న ఘటన వరంగల్ లో తీవ్ర కలకలంగా మారుతోంది. మెడికల్ కాలేజీలో పీజీ అనస్థీషియా చదువుతున్న వైద్య విద్యార్థిని ఉన్నట్టుండి హానికరమైన ఇంజక్షన్ తీసుకుని బలవన్మరణానికి ప్రయత్నించింది. అయితే ఇదే ఘటన ఇప్పుడు స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది. ఇకపోతే ఈ ఘటనలో తాజాగా కొన్నిసంచలన నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. అసలేం జరిగిందంటే?
హైదరాబాద్ కు చెందిన ధరావత్ ప్రీతి అనే అమ్మాయి వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజీలో పీజీ అనస్థీషియా చదువుతుంది. ఆమె తండ్రి రైల్వే ఎస్సైగా విధులు నిర్వర్తిస్తున్నాడు. అయితే చదువుల్లో చురుగ్గా ఉండే ప్రీతి ఇటీవల హానికరమైన ఇంజక్షన్ తీసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. వెంటనే గమనించిన తోటి స్నేహితులు, కాలేజీ సిబ్బంది ఆమెను స్థానిక ఆస్పత్రికి తరలించారు.
ఈ ఘటనపై స్పందించిన పోలీసులు కాలేజీ ప్రిన్సిపల్ ను ప్రశ్నించగా.. ప్రీతి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిందని అంగీకరించారు. కానీ, పోలీసులు విచారణలో మాత్రం… కాలేజీలోని సైఫ్ అనే సీనియర్ వైద్యుడు ప్రీతిని గత కొంత కాలంగా వేధింపులకు పాల్పడ్డాడని సమాచారం. ఇక దీని కారణంగానే ఆ యువతి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిందని తెలుస్తుంది. ఇక ఆ అమ్మాయి ఆత్మహత్యాయత్నానికి ఇది కాకుండా మరేదైన కారణం ఉందా? అసలేం జరిగిందనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఆ యువతి పరిస్థితి కాస్త విషమించడంతో మెరుగైన వైద్యం కోసం హుటాహుటిన హైదరాబాద్ కు తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆ యువతి ఆరోగ్య పరిస్థితి కాస్త విషమంగానే ఉన్నట్లుగా వైద్యులు తెలిపారు. ఉన్నట్టుండి కూతురు ఆత్మహత్యాయత్నానికి పాల్పడడంతో ఆమె తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. గతంలో సైఫ్ అనే సీనియర్ వైద్యుడు మా కూతురిని వేధింపులకు గురి చేశాడని. దీని కారణంగానే ప్రతీ ఆత్మహత్యాయత్నానికి పాల్పడిందని ప్రతీ తల్లిదండ్రులు తెలిపారు. ఈ ఘటన ఇప్పుడు స్థానికంగా ఇప్పుడు తీవ్ర కలకలంగా మారింది.