ఈ రోజుల్లో కొందరు దుర్మార్గులు రెచ్చిపోయి ప్రవర్తిస్తున్నారు. క్షణికావేశంలో ఊహించని దారుణాలకు పాల్పడుతు రక్తపాతాన్ని సృష్టిస్తున్నారు. అచ్చం ఇలాగే బరితెగించిన ఓ కుమారుడు కన్నతల్లిని కాటికి పంపించాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ దారుణ ఘటన వరంగల్ లో చోటు చేసుకుంది. ఇదే ఘటన ఇప్పుడు స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది. అసలు ఈ దారుణ ఘటనలో ఏం జరిగింది? తల్లిని రోకలి బండతో కిరాతకంగా చంపడానికి దారి తీసిన పరిస్థితులు ఏంటనే పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
వరంగల్ లోని లెనిన్ కాలనీలో కృష్ణ అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. ఇతనికి గతంలో వివాహం జరిగింది. పెళ్లైన నాటి నుంచి ఈ దంపతుల దాంపత్య జీవితం బాగానే సాగుతూ వచ్చింది. అయితే కృష్ణ తల్లి కూడా వీరి వద్దే నివాసం ఉండేది. అలా కొన్ని రోజుల తర్వాత భార్యాభర్తల మధ్య విభేదాలు భగ్గుమన్నాయి. ఏదో కారణంతో దంపతులు ఇద్దరూ తరుచు గొడవ పడేవారు. దీంతో తల్లి కొడుకు, కోడలు వారికి నచ్చజెప్పే ప్రయత్నం చేస్తుండేది. కాగా తాజాగా కృష్ణ మరోసారి తన భార్యతో గొడవ పడ్డాడు. దీంతో అతని తల్లి వారి మధ్యలోకి వెళ్లి సర్దిచెప్పే ప్రయత్నం చేయబోయింది. ఇక కోపంతో ఊగిపోయిన కుమారుడు కృష్ణ తల్లిపై దాడి చేశాడు.
ఇంతటితో ఆగక.. క్షణికావేశంలో ఇంట్లో ఉన్న రోకలి బండతో తల్లిపై బలంగా దాడి చేశాడు. కుమారుడి దాడిలో తల్లి అక్కడికక్కడే రక్తపు మడుగులో పడి ప్రాణాలు విడిచింది. తల్లి చనిపోయిందన్న విషయాన్ని తెలుసుకున్న కుమారుడు అక్కడి నుంచి పరారయ్యాడు. అనంతరం ఈ ఘటనపై స్పందించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించారు. అనంతరం ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది. కనిపెంచిన తల్లిని దారుణంగా కొట్టి చంపిన ఈ దుర్మార్గుడికి ఎలాంటి శిక్ష విధించాలి? మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.