ప్రేమిస్తున్నానని వెంటపడ్డాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి శారీరక కోరికలు తీర్చుకున్నాడు. ఇద్దరు ఏకాంతంగా కలిసున్నప్పుడు ప్రియుడు ఫోటోలు, వీడియోలు తీసుకుని తన ఫ్రెండ్ కు పంపాడు. దీనిని ఆసరాగా చేసుకున్న అతని స్నేహితుడు యువతపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. దీనిని భరించలేని ఆ యువతి మనస్థాపంతో ఆత్మహత్యకు పాల్పడింది. ఇటీవల వరంగల్ లో చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదంగా మారింది.
పోలీసుల కథనం మేరకు.. మహబూబాబాద్ మండలం ల్యాదేళ్ల గ్రామం. మాళవిక (19) అనే యువతి ఇంటర్ చదివి ఇంటి వద్దే ఉంటుంది. ఆమె ఇంటర్ చదివే రోజుల్లో ఇదే గ్రామానికి చెందిన సంగాల సాయి అనే యువకుడితో పరిచయం పెరిగింది. ఈ పరిచయంతోనే సాయి మాళవికను ప్రేమిస్తున్నానని వెంటపడ్డాడు. మనోడి ప్రేమకు కరిగిపోయిన మాళవిక కొన్నాళ్లకి అతని ప్రేమను అంగీకరించింది. దీంతో ఇద్దరు ఒకరినొకరు ప్రేమించుకున్నారు. కొన్నాళ్ల పాటు పీకల్లోతు ప్రేమలో మునిగితేలిన ఈ జంట సరదాగ సినిమాలకు, షికారులకు తిరిగారు.
ఇక ఈ క్రమంలోనే సాయి పెళ్లి చేసుకుంటానని నమ్మించి మాళవికతో శారీరకంగా కలుసుకున్నాడు. సాయి మాళవికతో ఏకాంతంగా ఉన్న సమయంలో వీడియోలు, ఫోటోలు తీసుకున్నాడు. ఇక ఇంతటితో ఆగకుండా.., అదే ఫోటోలను ఢిల్లీలో ఉన్న అతని ఫ్రెండ్ అయిన ప్రణయ్ అనే యువకుడికి పంపాడు. వీటిని ఆసరాగా చేసుకున్న ప్రణయ్ మాళవికను లైంగిక వేధింపులకు గురి చేశాడు. ప్రణయ్ వేధింపులను మాళవిక భరించలేకపోయింది.
దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన ఆ యువతి ఇంట్లో ఎవరూ లేని సమయంలో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. దీనిని గమనించిన ఆ యువతి తల్లిదండ్రులు వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడి చికిత్స పొందిన మాళవిక పరిస్థితి విషమించడంతో సోమవారం ప్రాణాలు విడిచింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపడుతున్నారు. ఈ విషాద ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.