అతడికి ఎంబీబీఎస్ చేయాలనే కోరిక బలంగా ఉండేది. అందుకోసం బాగానే చదివాడు. ఇందులో భాగంగానే నీట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ కు సిద్దమయ్యేవాడు. కానీ..!
ఈ రోజుల్లో చాలా మంది యువత ప్రతీ చిన్న చిన్న సమస్యలకు ఆత్మహత్యలు చేసుకుని కన్నవాళ్లకు కడుపు కోతను మిగిల్చి వెళ్లిపోతున్నారు. ప్రియుడు మోసం చేశాడని, తల్లిదండ్రులు మందలించారని, చదువులో రాణించలేకపోతున్నానంటూ చివరికి బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. అచ్చం ఇలాంటి ఘటనలోనే ఓ యువకుడు ఆత్మహత్య చేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. అయితే అతడు చనిపోయే ముందు రాసి పెట్టిన సూసైడ్ నోట్ చదివి అందరూ కన్నీటి పర్యంతమయ్యారు. అసలు అందులో ఏముందంటే?
పోలీసుల కథనం ప్రకారం.. వరంగల్ జిల్లా కేసముద్రం మండలం పరిధిలోని బోడాగుట్ట తండా. ఇక్కడే గుగులోతు లచ్చు-జ్యోతి దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి ఓ కూతురు, ఇద్దరు కుమారులు సంతానం. అయితే వీరి పెద్ద కొడుకు కృష్ణ (19) ఇటీవలే ఇంటర్ పరీక్షలు పూర్తి చేశాడు. కానీ, అతడికి ఎంబీబీఎస్ చేయాలనే కోరిక బలంగా ఉండేది. అందుకోసం బాగానే చదివాడు. ఇందులో భాగంగానే నీట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ కు సిద్దమయ్యేవాడు. అయితే గత కొన్ని రోజుల నుంచి కృష్ణ నాకు ఎంబీబీఎస్ సీటు రాదేమోనని తరుచు బాధపడుతుండేవాడని స్థానికులు చెబుతున్నారు.
ఇకపోతే ఇటీవల ఆ యువకుడి తల్లిదండ్రులు పొలం పనులకు వెళ్లారు. దీంతో ఆ యువకుడు ఇంట్లో ఒంటరిగానే ఉన్నాడు. ఈ సమయంలో దాని గురించే ఆలోచిస్తూ తీవ్ర మనస్థాపానికి గురయ్యాడు. ఇక ఈ క్రమంలోనే ఆ యువకుడు.. మమ్మీ, డాడీ.. ఐయామ్ సారీ. ఎంబీబీఎస్ నా డ్రీమ్. కానీ, ఎందుకో నాకు సీటు రాదేమో అనిపిస్తుంది. అందుకే చనిపోతున్నా అంటూ సుసైడ్ నోట్ రాసి ఇంట్లో ఫ్యానుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న అతడి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు గుండెలు పగిలేలా ఏడ్చారు.
దీంతో స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అనంతరం ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఎంబీబీఎస్ సీటు రాదేమోనని ఆత్మహత్య చేసుకున్న యువకుడి నిర్ణయంపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.