తల్లిదండ్రులు ఇష్టంలేని పెళ్లి చేశారని యువతి ఆత్మహత్య.. ఈ మధ్యకాలంలో ఇలాంటి ఘటనలే ఎక్కువగా వెలుగు చూస్తున్నాయి. బలవంతపు పెళ్లిల్లతో నలిగిపోతున్న అనేక మంది యువతులు బతకలేక , చావాలేక ఎటూ తెల్చుకోలేకపోతున్నారు. కోరుకున్నవాడితో ఏడడుగులు నడిచి అతనితోనే సంతోషమైన జీవితాన్ని గడపాలని ప్రతీ అమ్మాయి కోరుకుంటుంది. ఇలాంటి తరుణంలోనే కూతుళ్ల ఇష్టాలను కాదని కొందరు తల్లిదండ్రులు బలవంతంగా పెళ్లిల్లు చేస్తూ చేతులు దులుపుకుంటున్నారు.
ఇలా బలవంతపు పెళ్లిల్లకు అనేక మంది మహిళలు పెళ్లైన కొన్ని రోజులకే బలవన్మరణానికి పాల్పడుతున్నారు. ఇటీవల ఇలా అనేక మంది అమ్మాయిలు ఆత్మహత్యలు చేసుకున్న ఘటనలు లేకపోలేదు. అచ్చం ఈ తరహాలోనే ఓ యువతి పెళ్లైన కొన్ని రోజులకే పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన వరంగల్ లో చోటు చేసుకుంది. ఇక వివరాల్లోకి వెళ్తే..జనగామ జిల్లా చిల్పూరు మండల కేంద్రంలోని కొత్తపల్లెకు చెందిన దామెర లచ్చమ్మ కుమారుడు రాజ్‌కుమార్‌కు స్టేషన్‌ఘన్‌పూర్ మండలం ఇప్పగూడెం గ్రామానికి చెందిన గొడిశాల కుమారస్వామి–స్వరూపల కుమార్తె రేఖతో గత మార్చి 30వ తేదీన వివాహం జరిగింది.
ఇది కూడా చదవండి: Ranga Reddy: యువతి కోరుకున్నవాడితో లవ్ మ్యారేజ్! కట్ చేస్తే పెళ్లైన 3 నెలలకే భర్తతో గొడవపడి!అయితే పెళ్లి కన్న ముందు నుంచే రేఖ తనకు ఈ పెళ్లి ఇష్టం లేదని, నేను అతనితో కాపురం చేయనంటూ తెగేసి చెప్పింది. అయినా తల్లిదండ్రులు వినకుండా పట్టుబట్టి రేఖను బలవంతంగా ఒప్పించి పెళ్లి చేశారు. ఇష్టం లేని పెళ్లి చేశారని రేఖ తీవ్ర మనస్థాపానికి గురైంది. పెళ్లైన నాటి నుంచి రేఖ భర్తతో ఎడమొహం పెడమొహంగానే ఉండేది. కొద్దిరోజులు పుట్టింటికి పంపితే మారుతుందని భర్తతో పాటు అత్తామామల భావించి పుట్టింటికి పంపించారు.
సోమవారం రేఖను తిరిగి అత్తింటికి తీసుకువచ్చారు. అయినా రేఖ ఆలోచనలో ఎలాంటి మార్పు లేదు. దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన రేఖ మంగళవారం తెల్ల వారు జామున క్రిమిసంహారక మందు తాగి అపస్మారకస్థితిలోకి వెళ్లింది. వెంటనే గమనించిన కుటుంబ సభ్యులు స్థానిక ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ రేఖ మృతి చెందింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.