జీవితం ఎంతో విలువైనది. బతికున్నన్ని రోజులు నవ్వుతూ సంతోషంగా ఉండాలని అందరూ అంటుంటారు. పైగా ఈ రోజుల్లో మనుషులు ఉన్నచోటే కుప్పకూలుతూ అక్కడికక్కడే ప్రాణాలు విడుస్తున్నారు. అయితే కూతురు కళ్లముందే ప్రాణాలు విడిచాడు. ఈ సీన్ చూసిన కూతురు తట్టుకోలేక గుండెలు పగిలేలా ఏడ్చింది. మంగళవారం చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదంగా మారింది. అసలేం జరిగిందంటే?
మనిషి జీవితం ఎంతో విలువైనది. ఉన్నన్ని రోజులు నవ్వుతూ, సంతోషంగా ఉండాలని అందరూ అంటుంటారు. పైగా ఈ రోజుల్లో మనుషులు ఉన్నచోటే కుప్పకూలుతూ అక్కడికక్కడే ప్రాణాలు విడుస్తున్నారు. ఇదిలా ఉంటే ఓ వ్యక్తి తన కూతురి కళ్లముందే ప్రాణాలు విడిచాడు. ఆ క్షణంలో ఏం జరుగుతుందో తెలియని ఆ కూతురు ఒక్కసారిగా షాక్ గురైంది. కూతురు చూస్తుండగానే తండ్రి కానరాని లోకాలకు పయనమవ్వడంతో కూతురు గుండెలు పగిలేలా ఏడ్చింది. తాజాగా చోటు చేసుకున్న ఈ విషాద ఘటన వరంగల్ జిల్లాలో చోటు చేసుకుంది. అసలేం జరిగిందంటే?
మహబూబాబాద్ జిల్లా తొర్రురు మండలం వెంకటాపురం గ్రామం. ఇక్కడే పోలిన శ్రీనివాస్ (58) అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. ఇతనికి ఇద్దరు కుమారులు, కూతురు శృతి సంతానం. అయితే కుమార్తె హైదరాబాద్ లోని ఓ కాలేజీలో బీటెక్ చదువుతోంది. ఇకపోతే ఇటీవల కూతురు శృతి ఇంటికి వచ్చింది. తిరిగి కూతురుని కాలేజీకి పంపేందుకు మంగళవారం తండ్రీకూతురు కారులో బయలుదేరారు. ములుగు జిల్లా ఏటూరు నాగారంలోని జాతీయ రహదారిపై ప్రయాణిస్తుండగా.. వీరి కారును ఓ భారీ కంటైనర్ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో కారు నుజ్జునుజ్జు అయి శ్రీనివాస్ కూతురు కళ్లముందే ప్రాణాలు విడిచాడు.
ఇక కూతురు శృతి తీవ్ర గాయాలపాలై ప్రాణాలతో బయటపడింది. ఆ క్షణంలో ఏం జరుగుతుందో ఏం తెలియని ఆ అమ్మాయి.. గుండెలు పగిలేలా ఏడ్చింది. వెంటనే స్పందించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. శ్రీనివాస్ మృతదేహాన్ని కారులో నుంచి అతి కష్టంగా బయటకు తీశారు. అనంతరం గాయాలపాలైన కూతురిని ఆస్పత్రికి తరలించారు. ఈ విషయం తెలుసుకున్న శ్రీనివాస్ భార్య, కుమారులు కన్నీటి సంద్రంలో మునిగిపోయారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ విషాద ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.