వరంగల్ లో దారుణం చోటు చేసుకుంది. తాగుడుకు బానిసయ్యాడని ఓ భార్య భర్తను హత్య చేసింది. ఆ తర్వాత తనకేం సంబంధం లేదన్నట్లు సరికొత్త నాటకానికి తెర లేపి చివరికి పోలీసులకు దొరికిపోయింది. ఇటీవల చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది.
ఈ మధ్యకాలంలో కొందరు భార్యాభర్తలు ప్రతీ చిన్న సమస్య కూడా గొడవలు సృష్టించుకుంటున్నారు. ఇక గోరుతో పోయేదాన్నిచివరికి గొడ్డలి వరకు తెచ్చుకుంటూ హత్యలు, ఆత్మహత్యలతో జీవితాలను చేజేతులా నాశనం చేసుకుంటున్నారు. ఇలాంటి ఘటనలు దేశంలో రోజుకొకటి వెలుగు చూస్తున్నాయి. అయితే అచ్చం ఇలాంటి ఘటనలోనే ఓ భార్య పథకం ప్రకారం భర్తను చంపింది. ఆ తర్వాత నాకేం సంబంధం లేదన్నట్లుగా సరికొత్త డ్రామాకు తెర లేపింది. ఇటీవల వరంగల్ జిల్లాలో వెలుగు చూసిన ఈ దారుణ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారింది. అసలేం జరిగిందంటే?
పోలీసుల కథనం ప్రకారం.. వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం మంజుల కుంటతండా. ఇదే గ్రామంలో జాటోతు శ్రీను-శాంతి దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి చాలా ఏళ్ల కిందటే వివాహం జరిగింది. కొంతకాలానికి ఇద్దరు పిల్లలు కూడా జన్మించారు. ఇక పెళ్లైన చాలా కాలం పాటు ఈ దంపతులు సంతోషంగానే కాపురాన్ని కొనసాగించారు. ఇకపోతే రాను రాను భర్త శ్రీను తాగుడుకు బానిసయ్యాడు. అంతేకాకుండా రాత్రిళ్లు తాగొచ్చి భార్యను శారీరకంగా, మానసికంగా వేధించడంతో పాటు చిత్రహింసలకు గురి చేశాడని తెలుస్తుంది. మద్యం తాగుడు మానుకోవాలంటూ భార్య శాంతి అనేక సార్లు భర్తకు చెప్పి చూసింది.
అయినా భర్త శ్రీను తీరు మార్చుకోకపోగా రోజూ వేధింపులకు దిగేవాడు. ఇక భర్త తీరుతో విసుగుచెందిన ఆ ఇల్లాలు కట్టుకున్న మొగుడిని కాటికి పంపాలనుకుంది. తాను అనుకున్నదే ఆలస్యం.. ఆ దిశగా ప్రయత్నాలు కూడా మొదలు పెట్టింది. ఇటీవల భర్త తాగొచ్చింది చూసిన భార్య.. మరో వ్యక్తితో కలిసి భర్తను హత్య చేసింది. ఆ తర్వాత ఎవరికీ అనుమానం రాకుండా మృతదేహాన్ని రోడ్డుపై విసిరేసి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేసింది. దీనిని గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ముందుగా భార్య శాంతిని విచారించారు. పోలీసుల విచారణలో ఆ మహిళ.. నా భర్త రోడ్డు ప్రమాదంలో చనిపోయాడని నమ్మించే ప్రయత్నం చేసింది. చివరికి పోలీసుల స్టైల్ లో విచారించే సరికి శాంతి అసలు నిజాలు బయటపెట్టింది. నా భర్త శ్రీను తాగొచ్చి రోజూ వేధించేవాడని, అందుకే హత్య చేశానని తన నేరాన్ని అంగీకరించింది. అనంతరం పోలీసులు నిందితులను అరెస్ట్ చేసి జైలుకు పంపారు. ఇటీవల వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారింది. తాగుడుకు బానిసయ్యాడని భర్తను చంపిన భార్య దారుణంపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.