ర్యాగింగ్, వేధింపులు పేరు ఏదైనా కానీ.. ఈ రక్కసి.. అమాయక విద్యార్థులను బలి తీసుకుంటుంది. వరంగల్‌లో మెడికో ప్రీతి విద్యార్థుల వేధింపులు తాళలేక ఆత్మహత్యాయత్నం చేసి మృతి చెందగా.. తాజాగా మరో సంఘటన చోటు చేసుకుంది. ఆ వివరాలు..
సీనియర్ల వేధింపులు భరించలేక.. మెడికో విద్యార్థిని ప్రీతి మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ సంఘటన రాష్ట్రవ్యాప్తంగా పెను సంలనం సృష్టించింది. ప్రీతి మృతిపై రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం అయ్యింది. ఈ సంఘటన మరవకముందే మరో విషాదం చోటు చేసుకుంది. ఓ యువకుడి వేధింపులు భరించలేక.. బీటెక్ విద్యార్థిని మృతి చెందడం కలకలం రేపుతోంది. ఈ సంఘటన కూడా వరంగల్‌లోనే చోటు చేసుకోవడం గమనార్హం. బీటెక్ చదువుతోన్న ఓ విద్యార్థిని తన ఇంట్లో ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపుతోంది. రోజుల వ్యవధిలోనే ఒకే జిల్లాకు చెందిన ఇద్దరు విద్యార్థినులు ఇలా ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపుతోంది. ఆ వివరాలు..
బాధితురాలి పేరు రక్షిత(20) .. ఆమె స్వస్థలం భూపాలపల్లిగా పోలీసులు గుర్తించారు. ఓ విద్యార్థి వేధింపులతోనే రక్షిత మృతి చెందినట్లుగా పోలీసుల నిర్ధారించారు. రక్షిత ప్రస్తుతం నర్సంపేటలోలోని ఓ ఇంజనీరింగ్ కాలేజీలో ఈసీఈ థర్డ్ ఇయర్ చదువుతోంది. ఇక స్వగ్రామలో పదో తరగతి చదివే రోజుల్లో రక్షితకు పరిచయమైన రాహుల్ అనే యువకుడు గత కొంత కాలంగా రక్షితను వేధిస్తున్నాడు. అయితే సదరు విద్యార్థి వేధింపులు ఎక్కువ అయ్యాయి. రక్షిత ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానని బెదిరించాడు. దాంతో భయపడిన రక్షిత.. దీని గురించి తన తల్లిదండ్రలుకు తెలిపింది. వారు పోలీసులను ఆశ్రయించడంతో.. రాహుల్‌ని పిలిపించి.. అతడికి కౌన్సిలింగ్ ఇచ్చి పంపారు పోలీసులు.
శివరాత్రికి ఇంటికి వచ్చిన రక్షిత.. కాలేజీకి వెళ్తున్నానని చెప్పి ఇంటి నుంచి బయలుదేరింది. కానీ కాలేజీకి వెళ్లలేదు. దాంతో రక్షిత తల్లిదండ్రులు.. ఆమె కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇదిలా ఉండగా రెండు రోజుల తర్వాత రక్షిత తల్లిదండ్రుల వద్దకు చేరుకుంది. హాస్టల్‌లో ఉంటే ఇబ్బంది అవుతుందని చెప్పడంతో.. రక్షిత తండ్రి ఆమెను వరంగల రామన్నపేటలో నివాసం ఉంటున్న తన తమ్ముడు ఇంటికి పంపాడు. మిస్సింగ్ కేసు నిమిత్తం ఆదివారం పోలీస్ స్టేషన్‌కు వెళ్లాల్సి ఉండగా.. రక్షిత తన బాబాయి ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. రాహుల్ వేధింపులు తాళలేకనే తమ కుమార్తె ఆత్మహత్య చేసుకుంది అని ఆమె తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.
కాలేజీల్లో ర్యాగింగ్ భూతం, వేధింపులకు గురై విద్యార్థినిలు ఆత్మహత్య చేసుకుంటుంటడం.. అది కూడా వరంగల్ జిల్లాలోనే వరుస మరణాలు చోటు చేసుకోవడం కలకలం రేపుతోంది. ప్రీతి, రక్షిత ఆత్మహత్యలు ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా హాట్‌టాపిక్‌గా మారాయి. ప్రీతి మృతిపై ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన వ్యక్తం అవుతోంది. ఇప్పుడు మరో విదయార్థిని రక్షిత మృతి చెందడం కలకలం రేపుతోంది. మరి ఈ సంఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.