ఎన్నో ఆశలతో దంపతులు కొడుకులను కని, పెంచి పెద్ద చేస్తారు. కానీ, అదే కొందరు కొడుకులు తల్లిదండ్రులు మంచాన పడితే వారి యోగక్షేమాలు చూసుకోకుండా కన్నవారిపై దాడులకు పాల్పడుతూ చివరికి హత్యలు కూడా చేస్తున్నారు. అచ్చం ఇలాగే బరితెగించిన ఓ కుమారుడిపై తల్లిపై దారుణానికి పాల్పడ్డాడు. అసలేం జరిగిందంటే?
వయసు పెరిగి మంచనా పడితే అండగా ఉండి బాగోగులు చూసుకుంటారని భావించి ప్రతీ దంపతులు ఓ కొడుకును కనాలని అనుకుంటుంటారు. అలా ఎన్నో ఆశలతో కొడుకుని కని, పెంచి పెద్ద చేస్తారు. కానీ, అలా పెద్దవాడైన కొందరు కొడుకులు తల్లిదండ్రుల యోగక్షేమాలు చూసుకోకుండా కన్నవారిపై దాడులకు పాల్పడుతున్నారు. అంతేకాకుండా చివరికి హత్యలు కూడా చేస్తున్నారు. ఇలాంటి ఘటనలు మనం చాలానే చూస్తున్నాం. అచ్చం ఇలాగే ఇటీవల జరిగిన ఓ దారుణాన్ని తెలుసుకుంటే మాత్రం కన్నీళ్లు ఆగవు. అసలేం జరిగిందంటే?
వనపర్తి జిల్లా కొత్తకోట మండలం అమడబాకుల గ్రామం. ఇక్కడే శంకరమ్మ అనే మహిళ నివాసం ఉండేది. ఈమెకు రాములు అనే కుమారుడు ఉన్నాడు. గతంలో ఇతడు ఓ మహిళను వివాహం చేసుకున్నాడు. పెళ్లైన నాటి నుంచి శంకరమ్మ తన కొడుకు కోడలితో పాటే ఉండేది. అయితే గత కొంత కాలం నుంచి శంకరమ్మ అనారోగ్యానికి గురై మంచానికే పరిమితమైంది. ఈ క్రమంలోనే రాములు తన భార్యతో గొడవ పడేవాడు. దీంతో శంకరమ్మ వీరిద్దరి గొడవను చల్లార్చేందుకు వారి మధ్యలోకి వెళ్లేది. ఇకపోతే ఇటీవల కూడా ఈ దంపతులు మరోసారి గొడవ పడ్డారు.
శంకరమ్మ వీరి మధ్యలోకి వెళ్లింది. దీంతో రాములు కోపంతో తన భార్యతో కలిసి తన తల్లి శంకరమ్మపై దాడి చేశారు. అంతేకాకుండా కొడుకు తల్లిని ఇంటిముందున్న నీటి సంపులో పడేశాడు. ఈ నీటిలో మునిగి శంకరమ్మ ప్రాణాలు విడిచింది. ఈ విషయం తెలుసుకున్న స్థానికులు నీటి సంపులో ఉన్న శంకరమ్మను చూసి ఒక్కసారిగా షాక్ గురయ్యారు. అనంతరం గ్రామస్తులు అంతా కలిసి రాములు, అతని భార్యను చితకబాదారు. ఆ తర్వాత స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.
హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు నీటి సంపులో ఉన్న శంకరమ్మ మృతదేహాన్ని బయటకు తీసి పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఇక ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు కొడుకు రాములును అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఇటీవల చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది. కన్నతల్లిని నీటి సంపులో పడేసి హత్య చేసిన ఈ కుమారుడి దారుణంపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.