అతనికి అందమైన భార్యతో పాటు సాఫ్ట్ వేర్ ఉద్యోగం. సంతోషంగా సాగుతున్న కాపురం, ఎన్నో ఆశలతో ఆ యువతి పెళ్లి చేసుకుని పుట్టింటిని వీడి అత్తింట్లో అడుగు పెట్టింది. అందరిలా అందమైన జీవితాన్ని గడపాలని ఎన్నో కలల కనింది. కానీ ఆ కలలను కట్టుకున్న భర్తే నాశనం చేస్తూ భార్య ఆత్మహత్యకు కారణమయ్యాడు. తాజాగా విజయనగరంలో చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదంగా మారింది. అసలు ఆ మహిళ చిన్న వయసులోనే ఆత్మహత్య చేసుకోవడానికి కారణం ఏంటి? భర్త ఎలాంటి వేధింపులకు పాల్పడ్డాడనే పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
అది విజయనగరం జిల్లాలోని నటరాజ్ కాలనీకి చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజనీరు సూర్య భార్గవ్ కుమార్‌కు నిర్మల అనే యువతిని ఇచ్చి 2020 డిసెంబరు 23న వివాహం చేశారు. కూతురు పెళ్లికి నిర్మల తల్లిదండ్రులు సుమారు 40 లక్షల రూపాయల వరకూ ఖర్చు చేశారు. నిర్మల తల్లిదండ్రులు వివాహ సమయంలో 6 లక్షల రూపాయల నగదు, బంగారు ఆభరణాలు, కేజీన్నర వెండి, ఇతర కానుకులు అందజేశారు. ఇక పెళ్లైంది. భర్తతో పాటు నిర్మల కోరుకున్న జీవితాన్ని అస్వాదించాలనుకుంది. భార్యాభర్తలిద్దరూ సాఫ్ట్ వేర్ ఉద్యోగాలు చేస్తూ మంచి లైఫ్ ను లీడ్ చేస్తున్నారు.
ఇది కూడా చదవండి: Late Night Party: లేట్ నైట్ పార్టీ.. నడిరోడ్డుపై కొట్టుకున్న అమ్మాయిలు, అబ్బాయిలు
అలా కొన్ని రోజుల పాటు వీరిద్దరి వైవాహిక జీవితం సంతోషంగానే సాగుతూ వచ్చింది. ఇక పెళ్లై ఏడాది గడవక ముందే నిర్మలకు భర్త నుంచి వరకట్న వేధింపులు ఎదురయ్యాయి. మీ అమ్మవాళ్లు ఇచ్చిన కట్నం సరిపోదని మరింత కావాలంటూ చెప్పాడు. నిర్మల మొదట్లో ఇవన్నీ శరమాములే అనుకుంటూ వచ్చింది. కానీ రోజు రోజుకు భర్త భార్గవ్ నుంచి వరకట్న వేధింపులు మరింత ఎక్కువయ్యాయి. ఏం చేయాలో అర్థం కాలేదు. ఇక భర్తతో పాటు అత్తామామలు కూడా వేధింపులకు గురి చేశారు. దీంతో నిర్మల తల్లి దండ్రులకు చెప్పి అడిగిన ప్రతీ సారి రెండు, మూడు లక్షల వరకు ఇచ్చారు.
అయినా మరింత కట్నం తేవాలంటూ భర్త వేధింపులకు గురి చేశాడు. దీంతో నిర్మల తీవ్ర మనస్థాపానికి గురైంది. ఇక ఇలా కాదని భావించిన ఆ వివాహిత ఆత్మహత్య చేసుకోవాలని భావించి ఫ్యాన్ కు ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. విషయం తెలిసిన భర్త, అత్త మామలు నిర్మల కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. హుటాహుటిన నిర్మల ఇంటికి వచ్చిన తల్లిదండ్రులు విగతజీవిగా ఉన్న కూతురిని చూసి ఒక్కసారిగా షాక్ కు గురై కన్నీరు మున్నీరుగా విలపించారు. తమ కూతురిది ఆత్మహత్య కాదని, భర్తతో పాటు అత్తా మామలు హత్య చేశారంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇక కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపడుతున్నారు. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.