ఈ రోజుల్లో పెళ్లైన కొంతమంది మహిళలు కట్టుకున్న భర్తను కాదని పరాయి మగాడి కోసం ఆరాటపడుతున్నారు. పెళ్లై పిల్లలు ఉన్నా కూడా ప్రియుడితో ఉండేందుకు ఇష్టపడుతున్నారు. అచ్చం ఇలాగే బరితెగించిన ఓ భార్య ప్రియుడిని దక్కించుకునేందుకు భర్తను దూరం చేయాలనుకుంది. ఇక భర్తను దూరంగా చేయడమే కాదు.., ఏకంగా ప్రాణాలతో లేకుండా చేసింది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ దారుణ ఘటన విజయనగరం జిల్లాలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన కథనం మేరకు.. విజయనగరం జిల్లా గుమ్మలక్ష్మీపురం గ్రామంలో రాజు, సుజాత అనే భార్యాభర్తలు నివాసం ఉంటున్నారు. వీరికి 10 ఏళ్ల క్రితం పెళ్లై ఇద్దరు కూతుళ్లు కూడా జన్మించారు. అలా కొంతకాలం పాటు వీరి కాపురం సాఫీగా సాగుతున్న క్రమంలోనే సుజాత పాడలి గ్రామానికి చెందిన రాము అనే యువకుడితో పరిచయం పెంచుకుంది.
ఈ పరిచయమే రాను రాను వివాహేతర సంబంధానికి దారి తీసింది. అలా వీరి చికటి కాపురం రోజుల నుంచి నెలలు గడుస్తూ వచ్చింది. ఈ క్రమంలోనే భార్యాభర్తల మధ్య తరుచు గొడవలు కూడా జరుగుతుండేవి. అయితే ఉన్నఊరిలో బతుకుదెరువు లేకపోవడంతో ఈ దంపతులు హైదరాబాద్ వెళ్లాలనుకున్నారు. ఇక అనుకున్నట్లుగానే పిల్లలను చదువు నిమిత్తం తమ బంధువుల వద్ద వదిలేసి రాజు, సుజాత హైదరాబాద్ పయనమయ్యారు. ఇక్కడే కొంత కాలం పని చేస్తూ ఈ దంపతులు పైసా పైసా కూడబెడుతున్నారు. అలా రోజులు గడుస్తున్న క్రమంలో భార్య తరుచు ఒక మగాడితో ఫోన్ లో మాట్లాడుతుందని భర్త రాజు పసిగట్టాడు. ఇలాంటి పాడు పనులు మానుకోవాలంటూ భర్త భార్యకు వార్నింగ్ ఇచ్చాడు.
అయినా తన వక్రబుద్దిని మార్చుకోని సుజాత ప్రియుడు రామ్ తో మాట్లాడుతూనే ఉండేది. రామ్ తో మాట్లాడుతున్న విషయం భర్త రాజుకు తెలియడంతో సుజాత ఇంకాస్త బరితెగించింది. నా భర్తతో నాకు సుఖం లేదు. ఎలాగైన భర్తను ప్రాణాలతో లేకుండా చేకుండా చేసి శవాన్ని కూడా వదలకు అని సుజాత ప్రియుడితో ఫోన్ లో చెప్పింది. అయితే ఏప్రిల్ 4న భర్త రాజు ఏదో పని మీద సొంతూరికి పయమనయ్యాడు. దీనినే ఆసరాగా చేసుకున్న సుజాత ప్రియుడికి ఫోన్ చేసి నా భర్తను ఎలాగైన హత్య చేయాలని చెప్పింది. ప్రియురాలి మాటను కాదనని ప్రియుడు రామ్ ఏప్రిల్ 6న తన స్నేహితుల సాయం తీసుకుని రాజు హత్యకు ప్లాన్ గీశాడు.
ఇందులో భాగంగానే రామ్ రాజుకు ఫోన్ చేసి పార్టీ చేసుకుందామని వంశదార నది ఒడ్డుకి పిలిపించాడు. ఇక రామ్ అనుకున్న ప్రకారమే అందరూ కలిసి మద్యం తాగారు. రాజు మద్యం మత్తులోకి జారుకున్నాక.. రామ్ ఆటో ఇంజన్ స్టార్ చేసి రాజుకు మెడకు తాడును బిగించి దారుణంగా హత్య చేశారు. అనంతరం రాజు శవాన్ని చెట్ల పొదల్లోకి విసిరేసి అక్కడి నుంచి పరారయ్యారు. రాజు మరణించడంతో అతని కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు. భార్య సుజాత మాత్రం తనకేం తెలియదన్నట్లుగా అత్తింటి కుటుంబ సభ్యుల ముందు నటిస్తూ వచ్చింది. దీంతో ఎందుకో అనుమానం వచ్చిన కుటుంబ సభ్యులు రాజు మరణంపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.
కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారించగా 5 నెలల తర్వాత అసలు విషయం బయటపడింది. ఈ దారుణానికి కారణం అతని భార్య సుజాతనే ప్రధాన సూత్రదారి అని పోలీసులు నిగ్గుతేల్చారు. ప్రియుడిని దక్కించుకునేందుకు భార్య సుజాత ఈ దారుణానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. 5 నెలల తర్వాత అసలు విషయం బయటపడడంతో రాజు కుటుంబ సభ్యులు అంతా ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ దారుణ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది. ప్రియుడి మాయలో పడి భర్తను చంపిన ఈ ఇల్లాలు దారుణంపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.