అత్తింటి వేధింపులు భరించలేక వివాహిత ఆత్మహత్యాయత్నం అనే చాలా వార్తలు విన్నాం. కానీ, ఏపీలోని ఓ జిల్లాలో మాత్రం.. అత్తింటి వేధిపులు భరించలేక ఓ అల్లుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అసలేం జరిగిందంటే?
ఈ మధ్యకాలంలో పెళ్లైన కొంతమంది మహిళలను భర్త, అత్తమామలు వరకట్నం పేరుతో వేధింపులకు పాల్పడుతున్నారు. అత్తింటి వేధింపులను భరించలేని మహిళలు భర్తతో విడాకులు తీసుకోవడం, లేదంటే ఆత్మహత్యలు చేసుకోవడమో చేస్తున్నారు. కానీ, ఏపీలో ఓ జిల్లాలో రివర్స్ జరిగింది. అత్తింటి వేధింపులు భరించలేక ఓ ఇల్లరికం అల్లుడు ఆత్మహత్యాయత్నం చేశాడు. తాజాగా విజయనగరం జిల్లాలో వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమవుతోంది. అసలేం జరిగిందంటే?
ఆస్పత్రి అవుట్ పోలీసుల కథనం ప్రకారం.. విజయనగరం జిల్లా పార్వతిపురం పట్టణంలో జి. ప్రతాప్ అనే వ్యక్తి నివాసం ఉండేవాడు. ఇతనికి గతంలో ఓ యువతితో వివాహం జరిగింది. దీంతో అప్పటి నుంచి ప్రతాప్ ఇల్లరికం అల్లుడిగా అత్తింట్లోనే ఉంటున్నాడు. స్థానికంగా పెయింటర్ గా పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఇక పెళ్లైన కొన్నాళ్లకి ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు జన్మించారు. ఇదిలా ఉంటే.. అత్తమామలు ప్రతాప్ తో రూ.5 లక్షలు అప్పు చేయించినట్లు తెలుస్తుంది. ఇదే విషయంపై అత్తమామలు తరుచు అల్లుడితో గొడవకు దిగేవారు. వీరి వేధింపులు భరించలేని ప్రతాప్.. భార్యా పిల్లలను అక్కడే వదిలేసి ఇటీవల తన తల్లిదండ్రుల వద్ద నివాసం ఉంటున్నాడు.
ఇక ఇదే విషయమై ప్రతాప్ తీవ్ర మనస్థాపానికి గురయ్యాడు. ఈ క్రమంలోనే అతడికి ఏం చేయాలో అర్థం కాక ఆదివారం ఇంట్లో పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. అతడి కుటుంబ సభ్యులు వెంటనే స్పందించి.. స్థానిక ఆస్పత్రికి తరలించారు. దీంతో వైద్యులు అతడికి మెరుగైన చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం అతడి ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్లు వైద్యులు తెలిపారు. అత్తమామలే వేధింపుల కారణంగానే ప్రతాప్ ఆత్మహత్యాయత్నం చేశాడని అతడి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు తెలిపినట్లు ఆస్పత్రి అవుట్ పోలీసులు తెలిపారు. ఇటీవల చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమవుతోంది. అత్తింటి వేధింపులు భరించలేక అల్లుడు ఆత్మహత్యాయత్నం చేసిన ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.